వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్‌లాండ్‌ను ఏదో రకంగా తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. తంత్రమో వేశో.. కుతంత్రం చేశో గ్రీన్‌లాండ్‌ను తమ భూభాగంలోకి కలిపేసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవైపు గ్రీన్‌లాండ్‌పై కన్నేస్తే యుద్ధం తప్పదంటూ డెన్మార్క్ ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ దీనిపై శరవేగంగా పావులు కదుపుతున్నారు.
ట్రంప్ తాజా ఆదేశాల్ని బట్టి గ్రీన్‌లాండ్‌తో పోరు కోసం యూఎస్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకునే క్రమంలో ఎవరైనా తమ మాట వింటే ఓకే.. లేకపోతే అమెరికా అంటే ఏమిటో చూపించాలని ఆ దేశ బలగాలకు దిశా నిర్దేశం చేశారు. గ్రీన్‌లాండ్‌ను సీజ్ చేయడానికి ఎంత సైనిక సాయం కావాలో అంతా వాడుకోవాలంటూ ఆర్మీకి సూచించారు ట్రంప్.
గ్రీన్‌లాండ్ భూభామనేది చైనా, రష్యా ఆక్రమించుకోలేదని, డెన్మార్క్‌కు పరిధిలో ఉందనే విషయాన్ని గుర్తించుకోవాన్నారు. ‘ గ్రీన్‌లాండ్ కచ్చితంగా మన వశం కావాలి. ముందు గ్రీన్‌లాండ్‌న దక్కించకోవడానికి ఎన్ని సునాయాస ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ట్రై చేద్దాం. ఒకవేళ అలా కాని పక్షంలో మన శక్తి ఏమిటో చూపించి దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సంకేతాలు పంపారు.
ఖనిజ సంపదతో నిండిన ఆ ద్వీపాన్ని నియంత్రించడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమని, ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్నారు. దాంతో గ్రీన్‌లాండ్ అనేది అమెరికా అత్యంత అవసరమని స్పష్టం చేశారు ట్రంప్.

ఇది యుద్ధానికి సంకేతమా?
2019లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్‌లాండ్‌పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్‌ను ప్రతిపాదించారు ట్రంప్.. అయితే దాన్ని డెన్మార్క్ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్‌లాండ్ ప్రజలకు భారీ ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పుడు సైనిక చర్య ద్వారానైనా గ్రీన్‌లాండ్ తమది కావాలని అంటున్నారు ట్రంప్. తాజా ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా-డెన్మార్క్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


