జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దోషిగా తేలితే పదవి నుంచి తప్పుకోవాల్సిందే.
ఈ నేపథ్యంలో నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్ లేఖ రాయడం గమనార్హం. నెతన్యాహుపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ పేర్కొన్నారు. ఆయనను విచారించడం న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌ను శాంతి మార్గంలో నడిపిస్తున్నారంటూ నెతన్యాహును ప్రశంసించారు. మరోవైపు ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ పెత్తనం పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ గత నెలలో ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించారు. అప్పుడు కూడా నెతన్యాహును వెనకేసుకొచ్చారు. ఆయనను పెద్ద మనసుతో క్షమించాలని అన్నారు.


