ఒమన్‌లో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి వర్క్ సర్టిఫికెట్స్, లైసెన్స్, తదితర పత్రాలు సరైనవి లేకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్కడి కార్మిక శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఒమన్‌లో వీసా పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగులలో ప్రవేశానికి సంబంధింత రంగాలలో వృత్తిపరమైన వర్గీకరణ సర్టిఫికేట్లు, లైసెన్స్‌లు అందుకు సంబంధించిన శాఖలకు చెందిన అధికారులనుంచి పొందవలసి ఉంటుంది. అయితే అలా పొందాల్సిన సమయంలో సంబంధిత అధికారులు అన్ని రకాలుగా సరైన సమాచారం ధృవీకరించుకున్నాకే ఆ పత్రాలు జారీ చేయాలని తెలిపింది. ఒకవేళ నకిలీ పత్రాలు జారీదేస్తే ఉద్యోగులతో పాటు సంబంధింత కంపెనీలు ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కాగా ఒమన్‌లో ఉన్న మెుత్తం విదేశీ కార్మికుల సంఖ్య దాదాపు 18 లక్షలు కాగా భారత్ నుంచి దాదాపు 5 లక్షలకు పైగా అక్కడ పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా ఒమన్‌లో పని చేస్తున్న భారతీయుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి.


