
గాజా సంక్షోభానికి తెర దించే క్రమంలో.. శాంతి ప్రణాళిక(Gaza Peace Plan) ఓ కొలిక్కి వచ్చింది. అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్‌హౌజ్ వేదికగా.. ఇజ్రాయెల్ అద్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు హమాస్ గ్రూప్ అంగీకరిస్తుందో లేదో అనే అనుమానాన్ని ఇద్దరూ వ్యక్తం చేయడం గమనార్హం.
అమెరికా ప్రతిపాదించిన ఈ 20 సూత్రాల శాంతి ఫార్ములాను హమాస్ గనుక ఒప్పుకుంటే.. 72 గంటల్లో వాళ్ల చేతుల్లో ఉన్న బందీలందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. యుద్ధ విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. హింసను వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష దక్కడంతో పాటు భద్రత నడుమ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. హమాస్ ఆయుధాలు వదిలి పాలన నుంచి తప్పుకుంటుంది కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు గాజాలో Board of Peace ఏర్పాటు చేస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయానికి గేట్లు తెరుస్తారు. ఇలా మిగిలిన అంశాలు ఉన్నాయి. అయితే..
ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు హమాస్(Hamas)కు మరోసారి ఈ ఇద్దరు నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిందేనన్న ధోరణితో ట్రంప్, నెతన్యాహులు మాట్లాడారు. ‘‘హమాస్ గనుక ఈ డీల్‌కు ఒప్పుకోకపోతే.. వారిని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక.. మరొకటి ఉండదు’’ అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు.. ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా.. కఠిన మార్గంలో అయినా అమలు అయ్యి తీరుతుంది అంటూ హమాస్‌కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ట్రంప్-నెతన్యాహు(Trump-Netanyahu) ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా 8 ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. హమాస్ ఇంతదాకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. పక్షపాతంగా ఉందనే
‘గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాదు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నా. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నా. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా.. గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగుతుంది. కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటాం’ అని నెతన్యాహు వివరించారు.
గాజా శాంతి ప్రణాళిక.. ముఖ్యాంశాలు
- గాజా నగరాన్ని ఉగ్రవాదం లేని ప్రాంతంగా మార్చడం.
- హమాస్‌కు పాలనా హక్కు లేకుండా, తాత్కాలిక పాలనను ఏర్పాటు చేయడం.
- ఇజ్రాయెల్ బంధీలను 72 గంటల్లో విడుదల చేయడం.
- ఇజ్రాయెల్ 250 జీవిత ఖైదీలు, మరియు 1,700 గాజా ఖైదీలను విడుదల చేయడం.
- ప్రతి ఇజ్రాయెల్ బంధీ మృతదేహానికి, 15 మంది గాజా మృతదేహాలను తిరిగి ఇవ్వడం.
- హమాస్ సభ్యులు ఆయుధాలు వదిలి శాంతిగా జీవించాలనుకుంటే, వారికి క్షమాభిక్ష ఇవ్వడం.
- హమాస్ సభ్యులు గాజా విడిచి వెళ్లాలనుకుంటే, భద్రతతో కూడిన మార్గం కల్పించడం.
- యుద్ధం ఆగిన వెంటనే, పూర్తి మానవతా సహాయం ప్రారంభించడం.
- జల, విద్యుత్, ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం.
- రఫా సరిహద్దు రెండు దిశలలో తెరవడం.
- బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా గాజా పాలన.
- ట్రంప్ అధ్యక్షతన, ఈ బోర్డు పునర్నిర్మాణం, నిధుల పంపిణీ నిర్వహిస్తుంది.
- బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులకు ఈ బోర్డులో భాగం.
- పాలనా కమిటీ apolitical, technocratic Palestinians తో ఏర్పాటవుతుంది.
- పాలస్తీనా అథారిటీ పునరుద్ధరణ తర్వాతే గాజా పాలన చేపట్టాలి.
- ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించడానికి, దశలవారీగా ప్రణాళిక.
- అంతర్జాతీయ మానిటర్లు ద్వారా గాజా లోని ఆయుధాల నిర్మూలన.
- ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ద్వారా “New Gaza” నిర్మాణం.
- ప్రత్యేక ఆర్థిక మండలం (Special Economic Zone) ఏర్పాటు.
- గాజా ప్రజలు అక్కడే ఉండేందుకు ప్రోత్సాహం, బలవంతంగా తరలింపు ఉండదు.