బెంగళూరుకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన పోస్ట్, గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక శారీరక వెతల గురించి చెప్పకనే చెబుతుంది.అతని పోస్ట్‌లోని వివరాల ప్రకారం క్యాబ్ డ్రైవర్‌గా తాను గాడిద చాకిరీ చేస్తున్నా సంతృప్తికర జీవితం గడపలేకపోతున్నానని వాపోయాడు.
వ్యాపారంలో నష్టపోయిన కారణంగా అప్పులు మిగిలాయి. దీంతో అందుకే ఖర్చుల నిమిత్తం యల్లో బోర్డు క్యాబ్‌ను అద్దెకు తీసుకుని, ఊబర్ . రాపిడోతో పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజూ దాదాపు 16 గంటలు డ్రైవ్ చేస్తాను. సుమారు 4 వేల రూపాయలు సంపాదిస్తాడు. అందులో 1.5 వేలు కారు అద్దెకు, 1.2 వేలు సీఎన్‌జీకి , ఫుడ్, వాటర్ కోసం 200 రూపాయలు ఖర్చవుతాయి. ఇక తనకు మిగిలిని రోజుకు దాదాపు 1000 రూపాయలు మిగులుతాయి. ఇలా బతకడం చాలా కష్టంగా ఉందని చెప్పుకొచ్చాడు.
తనకు వచ్చే రాబడి పరిస్థితి ఇలా ఉంటే, శారీరక శ్రమ మరింత దారుణంగా ఉంటుందని తెలిపాడు. కాళ్లు నొప్పులు.. ఇక చాలు బాబోయ్.. అని మోకాళ్లు మొరాయిస్తుంటాయి. రోజులో కేవలం 6 గంటల నిద్ర. ఇక తనకు సమయం మిగిలడంలేదనీ, అందుకే సోషల్‌మీడియాలో మధ్య ఏ సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండటంలేదని చెప్పాడు. ఇక ఇంధన కోసం పొడవైన క్యూలలో వేచి ఉండాలి.. అసలు ఇది ఒక జీవితమేనా? అనిపిస్తుంటుంది. తమ లాంటి డ్రైవర్లు తాము పనిచేసే యాప్‌ల నుండి నిరంతర ఒత్తిడి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే దీన్ని'గాడిద చాకిరీ' అంటాం. “యాప్ 'ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్' లాగా పనిచేస్తుంది. వచ్చిన రైడ్‌ను త్వరగా, అంటే 5-6 సెకన్లలో అంగీకరించకపోతే, మరొకరు తీసుకుంటారు. రైడ్‌లనువెంటనే యాక్సెప్ట్ చేయకపోతే రేటింగ్ పడిపోతుంది అని వివరించాడు.
ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!
ట్రాఫిక్‌లో నానా కష్టాలుపడి ఇంటికి రాగానే, ఎంత అలిసిపోయినా కారు కడగాల్సిందే. ఇంతక చేసినా తమ కష్టానికి ఏమీ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వేలాదిమంది ఉద్యోగాల వాస్తవికత ఇదే. అయితే దోపిడీ చేసేవాడు.. లేదా దోపిడీకి గురయ్యేవారు. లేదా దోపిడీ చేసేవాడిగా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యేవాడిగా ఉండాలి.చౌక శ్రమ వల్లే ఇతరులు ఈ సౌకర్యాలను అనుభవించగలుగుతున్నారు అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై సానుభూతిని ప్రకటించారు. ఏమీ చేయలేని పరిస్తితిలో ఉన్నాం. మీ ప్రతి మాటలో మీ మానసిక,శారీరక బాధను రెండూ అర్థం చేసుకోగలం అంటూ సానుభూతి వ్యక్తంచేశారు. అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి అని మరికొందరు చెప్పారు. చాలామంది గిగ్ కార్మికులను గౌరవించాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు.


