breaking news
top range
-
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు
2025 దాదాపు ముగిసింది. ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో లెక్కకు మించిన కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి. ఇందులో ఫ్యూయెల్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు లాంచ్ అయిన.. అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.టాటా హారియార్ ఈవీఎలక్ట్రిక్ వాహన విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టాటా హారియార్ ఈవీ.. 2025లో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన ఒక బెస్ట్ మోడల్. రూ.21.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ కారు.. ఒక ఫుల్ ఛార్జితో 627 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 65 కిలోవాట్, 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. 6.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగల ఈ SUV AWD వేరియంట్లో నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను (బూస్ట్, స్పోర్ట్, సిటీ & ఎకో), RWD వేరియంట్లో మూడు డ్రైవింగ్ మోడ్‌లను (ఎకో, సిటీ & స్పోర్ట్) పొందుతుంది.ఈ ఎలక్ట్రిక్ కారు లోపలి భాగంలో.. 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.53-అంగుళాల హర్మాన్-సోర్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో డ్రైవర్ సీటు, వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, విండో సన్‌బ్లైండ్‌లు, యాంబియంట్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.హ్యుందాయ్ క్రెటా ఈవీఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్మార్ట్ (O), ఎక్సలెన్స్ LR అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 42kWh (390 కి.మీ), 51.4kWh (473 కి.మీ.) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. పెద్ద బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు పడుతుంది, 11kW AC హోమ్ ఛార్జర్‌ను ఉపయోగించి 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది.టెస్లా మోడల్ వైటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.2025 బీవైడీ సీల్భారతదేశంలో సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ అప్డేటెడ్ మోడల్ ఈ ఏడాది లాంచ్ అయింది. రూ. 41 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు.. డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.BYD సీల్ డైనమిక్ 61.44 kWh బ్యాటరీ ద్వారా 510 కి.మీ పరిధి అందిస్తే.. ప్రీమియం & పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో 82.56 kW బ్యాటరీ ప్యాక్.. వరుసగా 650 కి.మీ & 580 కి.మీ పరిధిని అందిస్తుందని సమాచారం.2025 బీవైడీ అట్టోరూ. 24.99 లక్షల ఖరీదైన 2025 బీవైడీ అట్టో కారు.. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు, అప్‌గ్రేడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ పొందుతుంది. ఇది కూడా డైనమిక్, ప్రీమియం & సుపీరియర్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. డైనమిక్ 49.92 kWh బ్యాటరీ 468 కి.మీ, ప్రీమియం & సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా 580 కి.మీ. రేంజ్ అందిస్తాయి.BYD Atto 3 ఎలక్ట్రిక్ SUVలో డైనమిక్, ప్రీమియం మరియు సుపీరియర్ అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. BYD Atto 3 డైనమిక్ 49.92 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది ARAI పరిధి 468 కి.మీ. BYD Atto 3 ప్రీమియం మరియు సుపీరియర్ వేరియంట్లు 60.48 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉన్నాయి, ARAI క్లెయిమ్ చేసిన పరిధి 580 కి.మీ. -
ఉక్కు తయారీలో అగ్రస్థానమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఉక్కు తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని చేరుకునేందుకు కేంద్రప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) డెరైక్టర్ ఎస్.ఎస్.మహంతి తెలిపారు. దేశంలో ఇనుము, ఉక్కు రంగాల్లో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ సమన్వయపరిచేందుకు, తద్వారా ఈ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. వంద కోట్లు, ప్రైవేట్ కంపెనీలు మరో రూ.వంద కోట్లు అందించాయని, ఈ మూలధనంతో సంస్థ పనిచేస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం మిశ్రధాతు నిగమ్ (మిధాని), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్‌లు ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు మహంతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోహాల తయారీలో భారత్ ఇతర దేశాలకు ఏమాత్రం తీసిపోదని, అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా పరిశోధనలను ముమ్మరం చేసేందుకు కొత్త కేంద్రం ఉపకరిస్తుందన్నారు. భారత్ అభివృద్ధి చేస్తున్న యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ఉపయోగించిన ప్రత్యేకమైన ఉక్కు మొత్తం స్వదేశంలోనే తయారైందని మరే ఇతర దేశం ఇలాంటి ఘనత సాధించలేదని చెప్పారు. సీఆర్జీవో స్టీల్ తయారీకి ఒప్పందం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే సీఆర్జీవో ఉక్కు తయారీని దేశీయంగానే చేపట్టేందుకు మిశ్రధాతు నిగమ్ సెయిల్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం.నారాయణరావు తెలిపారు. ఏటా కొన్ని లక్షల టన్నుల సీఆర్జీవో ఉక్కును దిగుమతి చేసుకుంటున్నామని, సొంతంగా తయారు చేసుకుంటే విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని చెప్పారు. ఇందుకు తగ్గ వసతులు మిశ్రధాతు నిగమ్‌లో అందుబాటులోనే ఉన్నాయని అన్నారు. సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్స్‌లో ఈ ప్రత్యేక ఉక్కును తయారు చేసి మిధానీలో దాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎన్ఎండీసీ సీఎండీ నరేంద్ర కొఠారీ, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డెరైక్టర్ వెంకట కృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ డెరైక్టర్ అమోల్ గోఖలే తదితరులు పాల్గొన్నారు.


