నేషనల్ అకాడమీ అఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో దేశ, విదేశాలలో.. అత్యంత ప్రాధాన్యత కలిగిన సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్‌లైన్ ట్రైనింగ్ కొరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఇంటర్ పాస్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా & ఇంజనీరింగ్ చదువుతున్న.. పూర్తి చేసిన విద్యార్థులు, సాఫ్ట్‌వేర్, ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, డిఫెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రిటైల్, ఈ కామర్స్, ఎడ్యుకేషన్ మొదలైన రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఈ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో ఆన్‌లైన్ ద్వారా ట్రైనింగ్ పొందేందుకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అర్హులు.
కోర్సులు
సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్. మాస్టర్ ప్రోగ్రాం ఇన్ సైబర్ సెక్యూరిటీ & ఎథికల్ హాకింగ్. శిక్షణ కాలం 5 నెలల నుంచి 10 నెలల వరకు ఉంటుంది. ట్రైనింగ్ తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ అందిస్తారు.
సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో విస్తృత ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సాఫ్ట్‌వేర్, ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్ , ఈ కామర్స్, ఎడ్యుకేషన్ రంగంలో సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, పెనీట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ ఇంజనీర్, సెక్యూరిటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, ట్రైనర్ మొదలైన ఉద్యోగావకాశాలు గలవు.


