అవీవా ఇండియా ‘అవీవా స్మార్ట్ వైటల్ ప్లాన్’ను ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే జీవిత బీమాకు రణ కల్పించే అచ్చమైన స్థిర ప్రయోజన పాలసీ. కనీసం రూ.10 లక్షల నుంచి బీమా రక్షణ మొదలవుతుంది. 49 తీవ్ర అనారోగ్యాల్లో (క్రిటికల్ ఇల్‌నెస్) ఏదేనీ బారిన పడి, 15 రోజుల పాటు జీవించి ఉంటే ఈ ప్లాన్‌లో రూ.10/15/20 లక్షలు ఒకే విడత ప్రయోజనం అందిస్తారు.
పాలసీ తీసుకున్న 90 రోజుల తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. రోజువారీ నడక ద్వారా ఇందులో రివార్డులు జమ చేసుకోవచ్చు. వీటి ద్వారా బీమా రక్షణను రెండు రెట్లకు పెంచుకోవచ్చు. రూ.20–50 ఏళ్ల మధ్య వయసు వారు పాలసీని 10–15–20 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు.
ఇందులో ప్రీమియం చెల్లింపునకు వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక, నెలవారీ వంటి సౌకర్యవంతమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ కాలంలో బీమాదారు మరణిస్తే నామినీకి ముందుగా నిర్ణయించిన సమ్ అష్యూర్డ్‌ను చెల్లిస్తారు. అవసరమైతే అదనపు రైడర్లను కూడా జత చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని వయసు, బీమా కాలం, ఎంచుకున్న కవరేజ్ ఆధారంగా నిర్ణయిస్తారు.
పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. వర్తించే ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ప్రీమియంపై మినహాయింపులు, క్లెయిమ్ మొత్తంపై పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య సంబంధిత ప్రమాదాలకు రక్షణ కోరుకునే వారికి ఈ ప్లాన్ సరైన ఎంపికగా అవీవా ఇండియా పేర్కొంది.


