ఎలక్ట్రిక్‌ కార్లదే సూపర్‌ స్పీడ్‌! | FADA reports 57pc EV growth in October | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ కార్లదే సూపర్‌ స్పీడ్‌!

Nov 19 2025 1:11 PM | Updated on Nov 19 2025 1:31 PM

FADA reports 57pc EV growth in October

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్‌ కార్లను కొనేందుకు ప్రజలు అధికాసక్తి చూపుతున్నారు. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది(2025) అక్టోబర్‌లో ఈ విభాగపు రిటైల్‌ విక్రయాల్లో 57% వృద్ధి నమోదైంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌(ఫాడా) గణాంకాల ప్రకారం 2024 అక్టోబర్‌లో 11,464 ఈవీ కార్లు అమ్ముడవగా, ఈ ఏడాది ఈ సంఖ్య 18,055 యూనిట్లకు చేరింది.

ఈ సెగ్మెంట్‌లో 7,239 యూనిట్లతో టాటా మోటార్స్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఎంజీ మోటార్స్‌(4,549 యూనిట్లు), మహీంద్రాఅండ్‌మహీంద్రా(3,911 యూనిట్లు), కియా ఇండియా(955 యూనిట్లు), బీవైడీ (570 యూనిట్లు) తరువాత స్థానాల్లో నిలిచాయి.

టూవీలర్స్‌ అమ్మకాల్లో వృద్ధి అంతంతే: ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ విభాగంలో అమ్మకాలు నామమాత్ర వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది అక్టోబర్‌లో 1.40 లక్షల యూనిట్లు అమ్ముడవగా, ఈసారి కేవలం 3% వృద్ధితో 1.43 లక్షల యూనిట్లు విక్రయాలు జరిగాయి. బజాజ్‌ ఆటో 31,426 యూనిట్లు అమ్మడం ద్వారా మారెŠక్‌ట్‌ లీడర్‌గా నిలిచింది. టీవీఎస్‌ మోటార్‌ 29,515 యూనిట్లు, ఏథర్‌ ఏనర్జీ 28,101 యూనిట్లు, ఓలా ఎలక్ట్రిక్‌ 16,036 యూనిట్లు, హీరో మోటోకార్స్‌ 15,952 యూనిట్లు, గ్రీవ్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ 7,629 యూనిట్ల విక్రయాలు సాధించాయి.

ఇక ఈత్రీ వీలర్స్‌ సిగ్మెంట్‌లో వార్షిక ప్రాతిపదికన 5% వృద్ధితో 70,604 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహన అమ్మకాలు రెండు రెట్ల వృద్ధితో 1,767 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement