ఏఐ ఆధారిత పరిపాలన, వాణిజ్య ఆటోమేషన్ సొల్యూషన్స్‌లో ప్రత్యేకత సాధించిన భారతీయ కంపెనీ అయిన ఆర్ఎన్ఐటీ ఏఐ సొల్యూషన్స్ లిమిటెడ్ (BSE: RNITAI) సౌదీ అరేబియాకు చెందిన డిజిటల్ మార్పు పరిష్కారాల ప్రొవైడర్ అయిన అజ్నిహత్ అల్‌నజా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. 3 మిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందంతో ఆర్ఎన్ఐటీ జీసీసీ రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. సౌదీ అరేబియా వ్యాప్తంగా, ఇతర జీసీసీ దేశాల్లో డిజిటల్ మార్పు చర్యలకు మద్దతిచ్చే అవకాశాలను సంయుక్తంగా అన్వేషిస్తోంది.
ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఆర్ఎన్ఐటీ, అజ్నిహత్ అల్‌నజా గ్రూప్ రెండూ కలిసి తమ బలాలను కలిపి అత్యాధునిక ఏఐ ఆధారిత ఆటోమేషన్, డిజిటల్ ఎనేబుల్‌మెంట్ సొల్యూషన్స్ విషయంలో పెరుగుతున్న డిమాండును అందిపుచ్చుకోనున్నాయి. ఏఐ ఆధారిత పాలనా ప్లాట్‌ఫాంలు, వాణిజ్య ఆటోమేషన్, ముఖ గుర్తింపు పరిజ్ఞానం, జెనరేటివ్ ఏఐ, కన్వర్సేషనల్ ఏఐ పరిష్కారాలు, ఐఓటీ ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలు, ఓపెన్ సోర్స్ డిజిటల్ మార్పు ఫ్రేం వర్కులో తన అనుభవాన్ని ఆర్ఎన్ఐటీ అందిస్తుంది. అజ్నిహత్ అల్‌నజా గ్రూప్ స్థానిక మార్కెట్‌ను అర్థం చేసుకోవడం, కస్టమర్ ఎంగేజ్‌మెంట్ సపోర్ట్, ప్రాంతీయ వ్యాపారాభివృద్ధి సామర్థ్యాలను అందిస్తుంది.
విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల కోసం ఫేసిఫై ఈఆర్‌పీ ఐడెంటిఫికేషన్ సూట్, ఆర్ఎన్ఐటీ-ఎన్ఐఏ ఏఐ ప్లాట్‌ఫాంలు, ఓపెన్ సోర్స్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సిస్టంలు, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ ఇంజిన్లు, ఏఐ ఆధారిత నిర్ణయాలకు మద్దతు తెలిపే టూల్స్ లాంటివాటిపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టిపెడుతుంది. రెండు కంపెనీలు కలిసి సాంకేతిక భాగస్వామ్యం, విజ్ఞాన షేరింగ్, స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఇద్దరూ కలిసి రూపొందించే ఇన్నోవేషన్ చర్యలను కూడా పరిశీలిస్తాయి.


