2010లో పెట్టిన ఆర్డర్.. 2026లో వచ్చిన డెలివరీ | Nokia Phones Ordered In 2010 Reach Libyan Store After 16 Years | Sakshi
Sakshi News home page

2010లో పెట్టిన ఆర్డర్.. 2026లో వచ్చిన డెలివరీ

Jan 11 2026 2:45 PM | Updated on Jan 11 2026 3:29 PM

Nokia Phones Ordered In 2010 Reach Libyan Store After 16 Years

ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. డెలివరీ కావడానికి ఓ నాలుగైదు రోజులు లేదా వారం రోజులు అనుకుందాం. ఆర్డర్ పెట్టిన 16 ఏళ్ల తరువాత డెలివరీ అయితే?, ఇది వినడానికి వింతగా అనిపించినా.. లిబియాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో నోకియా ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. దీంతో కొత్తగా ఏ మోడల్ వచ్చిన సేల్స్ అద్భుతంగా జరిగేవి. ఇలాంటి సమయంలో లిబియాకు చెందిన ఓ షోరూమ్ ఓనర్ 2010లో ఎక్కువ సంఖ్యలో నోకియా ఫోన్స్ ఆర్డర్ పెట్టారు. అయితే అవి మాత్రం 2026లో డెలివరీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. ఒక వ్యక్తి నోకియా ఫోన్లను ఒక్కొక్కటిగా చూపించడం, అక్కడున్నవారంతా నవ్వుకోవడం చూడవచ్చు. ఇక్కడ వివిధ నోకియా మోడల్స్ ఉన్నాయి.

ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?

నిజానికి 2010లో నోకియా ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. అయితే కాలక్రమంలో ప్రత్యర్ధ కంపెనీలకు సరైన పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్లను డిమాండ్ ఉంది. ఇప్పుడు నోకియా ఫోన్స్ వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. డెలివరీకి 16ఏళ్ల సమయం పట్టడానికి కారణం.. అప్పట్లో లిబియాలో సివిల్ వార్ మొదలైంది. దీంతో దేశం మొత్తం అతలాకుతలం అయింది. ఈ కారణంగా షిప్‌మెంట్ ఆగిపోయింది. డెలివరీ చేయాల్సిన మొబైల్స్ వేర్ హౌస్‌లోనే ఉండిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో డెలివరీలు జరిగాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement