
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ చేతులతో బిర్యానీ తింటున్న వైరల్ వీడయో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉంటూ ఇలా చేత్తో తినడం అనాగరికం అని, మీరు థర్డ్ వరల్డ్‌లోనే బతకండి అంటూ మామ్దని తీరుని తప్పుపట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచి చేత్తో తింటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చేత్తో తినడం అనే అలవాటు ఏనాటిది? పాశ్చాత్యులు తొలి నుంచే ఫోర్క్‌లు, స్పూన్‌లు,చాకులతోనే తినేవారా అంటే..
చేతులతో తినడం అనేది పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన అలవాటు కాకపోయినా..ఇది మన భారతీయ ఆచారం. అది మన సంస్కృతిలో భాగం కూడా. సింపుల్‌గా చెప్పాలంటే భారతీయులకు కేవలం పోషణ కాదు ఒక విధి విధానం. చరిత్ర ప్రకారం ఆదిమానవుల కాలం నాటిది ఈ అలవాటు. ఈజిప్షియన్లు, గ్రీకులు, మెసొపొటేమియన్లు, సింధులోయ నాగరికత ప్రజలు అంతా చేత్తోనే తినేవారు. ఇది మైండ్‌ఫుల్‌గా తినేందుకు చిహ్నం.
అంతేగాదు జీర్ణక్రియకు నేరుగా ఆహారాన్ని అందించే ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భారతీయ గ్రంథలు, ఉపనిషత్తులు కూడా చేతులతో తినడం అనేది శరీరాన్ని ఆత్మకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియగా పేర్కొన్నాయి. ఎందుకంటే చూడటం, వాసన రుచి, స్పర్శతో కూడిన ఇంద్రియానుభవమే భోజనం అని పురాణాలు చెబుతున్నాయి.
మన భారతీయ భోజనం బియ్యం, కూరలు కలయిక. కాబట్టి వాటిని తినాలంటే చేతులతో కలుపుకుని తింటే చక్కటి రుచిని ఆస్వాదించగలరు. అదే పాశ్చాత్యులకు రోస్ట్‌లు, గ్రిల్డ్ మాంసం, పాస్తా, బ్రెడ్ వంటివి ఆహారాలు. వాటిని తినాలంటే వాళ్లు చాక్‌లు, ఫోర్క్‌లు ఉపయోగించి తినాల్సిందే. ఎందుకంటే వాటిని అలానే తినేయం సాధ్యం కాదు. అయినా భారతీయుల ఆహారం అంతలా ఘనపదార్థాలుగా ఉండదు కాబట్టి ఆ అవసరం మనకు రాలేదు. పైగా ఇది మన సంస్కృతిలో భాగం.
చాప్‌స్టిక్స్ సంగతేంటి?
చైనా, జపాన్‌లోని ప్రజలు చాప్‌స్టిక్‌లను ఉపయోగిస్తారు. వాళ్లు వీటిని క్రీశ 400 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నారట. ఇటీవలే వాళ్ల భోజన విధానంలో ఫోర్క్‌లు, చాక్‌లు వచ్చాయట. ప్రస్తుతం అది ఆదునికతకు గుర్తుగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా, జపాన్‌లో చాప్‌స్టిక్‌తో తినడానికి కారణం.. బుద్దిపూర్వకంగా మనసుపెట్టి తినాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అదీగాక వాళ్ల ఆహారం చాలామటుకు చిన్ని చిన్న ముక్కులుగానే ఉంటుంది.
వాళ్లకు భోజనం అనేది ఏకాగ్ర చిత్తంతో చేసే ప్రక్రియ. ఈ విధానంలో తింటే మాటలు దొర్లవు, తింటున్న దానిపై ఫోకస్ ఉంటుదంట. అందులోనూ ఆకలితో ఉంటే..స్పీడ్‌గా తినాంటే ఆ చాప్‌స్టిక్‌లపై ఫోకస్ పెడితేనే తినగలరు లేదంటే వాటి మధ్య నుంచి ఆహారం జారిపోతుంది. పైగా అలా గనుక ఆహారం పారేస్తుంటే చైనా పెద్దలు తిట్టడమే గాక మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తినమని ఆదేశిస్తారట.
చేత్తో తినడం మంచిదేనా..
చేత్తో తినడం పరిశభ్రకరమైనదా అని పాశ్చాత్యులు ప్రశ్నిస్తుంటారు. కాని ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశమని నొక్కిచెబుతున్నారు శాస్త్రవేత్త అదితి. ఎందుకంటే భోజనానికి ముందు తర్వాత చేతులు తప్పక కడుక్కుంటారు. అలాగే కుడిచేయి అనేది పవిత్రమైన పనులకే ఉపయోగిస్తారు భారతీయులు. తిలకం పెట్టుకోవడం దగ్గర నుంచి ఇతరులకు డబ్బులు ఇవ్వడం, శుభాకార్యలకు అన్నింటికి కుడి చేతినే ప్రధానం ఉపయోగిస్తారు.
అలాగే ఎడమ చేతిని వ్యక్తిగత పరిశుభ్రతకే కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక చేత్తే తినడం వల్ల మనసారా తింటున్న అనుభూతి తోపాటు జీర్ణక్రియ నేరుగా వెళ్లి సులభంగా అరిగిపోయేలా చేయడంలో దోహదపడుతుందట. చేత్తో తింటేనే త్వరితగతిన అరిగిపోతుందని, ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైందని చెప్పుకొచ్చారు వైద్యులు.
(చదవండి: Zohran Mamdani: పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!)