న్యూయార్క్‌ తొలి ముస్లిం మేయర్‌ జోహ్రాన్ మమ్దానీ ఇంటిపై దాడి | New York City police identify device outside Zohran Mamdani home as explosive | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ తొలి ముస్లిం మేయర్‌ జోహ్రాన్ మమ్దానీ ఇంటిపై దాడి

Mar 9 2026 7:19 PM | Updated on Mar 9 2026 7:24 PM

New York City police identify device outside Zohran Mamdani home as explosive

వాషింగ్టన్‌: న్యూయార్క్‌ తొలి ముస్లిం మేయర్‌ జోహ్రాన్ మమ్దానీ (34)ఇంటిపై దాడి జరిగింది. అగంతకులు మమ్దానీ ఇంటిపై పేలుడు పదార్ధాలు విసిరారు.అయితే, పేలుడు పరికరాన్ని వెలిగించినప్పటికీ ఫ్యూజ్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రమాదం తప్పింది.

ఒకవేళ పేలి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. మమ్దానీ ఇంటిపై దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానితులు ఎమీర్‌ బాలాట్‌ (18), ఇబ్రహీం కయూమి(19)ని అదుపులోకి తీసుకున్నారు.

కేసు నమోదు చేసుకుని ఎఫ్‌బీఐకి చెందిన జాయింట్‌ టెర్రరిజం టాస్క్‌ ఫోర్స్‌ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తును ఉగ్రవాద కోణంలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement