న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య న్యూయార్క్ వాసులకు జోహ్రాన్ మమ్దానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్‌గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్‌గానూ పేరొందారు.
ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ ‘న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మేము ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసాం’ అని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా తక్కువగా సాగిన ఈ ప్రసంగంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా ఉద్దేశించి, ‘డోనాల్డ్ ట్రంప్.. మీరు దీనిని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి.. వాల్యూమ్ పెంచండి’ అని అన్నారు. మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.
న్యూయార్కర్లకు మమ్దానీ కృతజ్ఞతలు చెబుతూ వారు మార్పు కోసం, కొత్త రాజకీయాల కోసం ఆదేశించారని అన్నారు. 2025, జనవరి ఒకటిన తాను న్యూయార్క్ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దానీ ప్రకటించారు. న్యూయార్క్ ..వలసదారుల నగరంగానే ఉంటుంది. ఇది వలసదారులచే నిర్మితమైన నగరం.ఈ రాత్రి నుండి ఇది వలసదారుడి నేతృత్వంలో ఉంటుందని మమ్దానీ అన్నారు.
భారత సంతతికి చెందిన మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు. వలసదారుల నేతగా పేరొందిన మమ్దానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ప్రచారంలో మమ్దానీ పలు హామీలు ఇస్తూ, ఓటర్లను ఆకట్టుకున్నాడు. వీటిని ప్రముఖ హిందీ సినిమాల క్లిప్‌లతో అన్వయిస్తూ, పొందుపరిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
🚨Breaking News — Zoharan Mamdani creates History, the son of Immigrants, becomes the first Indian Muslim American to win NY Mayor Race. Here’s one video how he captured the imagination of a diverse New York. pic.twitter.com/a00nzdLVEI
— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) November 5, 2025
ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్‌జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ!


