'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల | New York Telangana Telugu Association 2006 Executive Committee | Sakshi
Sakshi News home page

NYTTA కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల

Dec 6 2025 4:05 PM | Updated on Dec 6 2025 4:19 PM

New York Telangana Telugu Association 2006 Executive Committee

న్యూయార్క్‌లో కొత్త కార్యవర్గం ఎంపిక

ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.

అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.

కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.

రవీందర్ కోడెల ప్రస్థానం
ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. 

చద‌వండి: ఎన్ని క‌ష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వ‌చ్చేస్తున్నా!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర  ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement