దివ్యాంగుల అభ్యున్నతికి కృషి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

Dec 6 2025 8:43 AM | Updated on Dec 6 2025 8:43 AM

దివ్య

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

పరీక్షల నియంత్రణాధికారిగా రాజేందర్‌ కొనసాగింపు

భూపాలపల్లి రూరల్‌: దివ్యాంగుల అభ్యున్నతికి సింగరేణి సంస్థ తనవంతు సహాయ సహకారం అందిస్తుందని సింగరేణి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని భూపాలపల్లి ఏరియాలోని కృష్ణకాలనీ మినీ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలను రాజేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు క్రీడలు దోహదపడుతాయని చెప్పారు. విజేతలకు బహుమతులను ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌. శ్యాంసుందర్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యాంసుందర్‌, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రటరీ మోటపలుకుల రమేశ్‌, నాయకులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు

అభినందనలు

కాటారం: జాతీయ, రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చి గోల్డ్‌మెడల్‌ సాధించిన మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను గురుకులాల ఆర్‌సీఓ హరిసింగ్‌ అభినందించారు. శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్‌సీఓ విద్యార్థులను అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్‌సీఓ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లి ప్రతిభ కనబర్చాలని సూచించారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మా ధవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకటయ్య, బలరాం, బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగలక్ష్మి, పీడీ మహేందర్‌, పీఈటీ శ్రీనివాస్‌, కోచ్‌ వెంకటేశ్‌, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మేడారంలో

మొక్కుల సందడి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లకు పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారంలో గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణం పనులు చేస్తున్న కార్యికులు, భక్తుల రద్దీతో గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిగా కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ప్రొఫెసర్‌ కె.రాజేందర్‌ను మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ శుక్రవారం రిజిస్ట్రార్‌ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ చేతులమీదుగా రాజేందర్‌ ఉత్తర్వులు అందుకున్నారు.

పెద్దాపూర్‌ క్లస్టర్‌ తనిఖీ

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి మండలం పెద్దాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన క్లస్టర్‌ను అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి శుక్రవారం తనిఖీ చేశారు. ఎంపీడీఓ తరుణి ప్రసాద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, వసతులపై ఆరా తీశారు. పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

దివ్యాంగుల  అభ్యున్నతికి కృషి
1
1/2

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

దివ్యాంగుల  అభ్యున్నతికి కృషి
2
2/2

దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement