స్వచ్ఛ్‌ విద్యాలయాలు | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ్‌ విద్యాలయాలు

Dec 6 2025 8:43 AM | Updated on Dec 6 2025 8:43 AM

స్వచ్

స్వచ్ఛ్‌ విద్యాలయాలు

చర్యలు తీసుకుంటాం..

రాష్ట్ర సాయికి 8 పాఠశాలలు ఎంపిక

భూపాలపల్లి అర్బన్‌: ‘స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ రేటింగ్‌’ కార్యక్రమంలో జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, గురుకులాలు, కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఆరు ప్రధాన అంశాల ఆధారంగా ద్వారా రేటింగ్‌ ఇచ్చి, ప్రోత్సాహక నిధులు, పురస్కారాలు ఇచ్చేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సెప్టెంబర్‌లో కార్యాచరణ మొదలు పెట్టింది. జాతీయ స్థాయికి ఎంపికై తే కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందనున్నాయి.

ఆరు అంశాల్లో మదింపు

జిల్లా వ్యాప్తంగా ఉన్న 504 పాఠశాలల్లో 42వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, పిల్లల్లో ఆహ్లాదకర, స్నేహపూరిత వాతావరణం పెంపొందించడం, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం వంటి అంశాల ప్రతిపాదికన స్వచ్ఛ ఎస్‌హెచ్‌వీఆర్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో పాల్గొన్న పాఠశాలలకు రేటింగ్‌ కేటాయించడంతో అక్టోబర్‌లో జిల్లాలోని దాదాపు 96 పాఠశాలలు 4, 5 స్టార్‌లు సాధించాయి. జిల్లాలోని 28 కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు వీటిని మరోసారి పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. 96 పాఠశాలలకు రెండు కేటగిరీలుగా విభజించారు. అందులో నుంచి రూరల్‌ నుంచి 6, అర్బన్‌నుంచి రెండు పాఠశాలలను గుర్తించారు. మూడు రోజుల క్రితం జిల్లాస్థాయి ప్రత్యేక బృందం 5 స్టార్‌ సాధించిన 8 పాఠశాలల నుంచి కేటగిరి 1, 2 ద్వారా రూరల్‌ విభాగంలో ఆరు, కేటగిరి 1, 2 ద్వారా అర్బన్‌ విభాగంలో రెండు పాఠశాలల చొప్పున ఎంపిక చేశారు.

పాఠశాలల వివరాలు

రూరల్‌: కేటగిరి 1: ఎంపీయూపీఎస్‌ పిడిసిల్ల(మొగుళ్లపల్లి), ఎంపీపీఎస్‌ సూరారం, ఎస్సీకాలనీ (మహదేవపూర్‌), ఎంపీయూపీఎస్‌ కొయ్యారు (మల్హర్‌)

కేటగిరి 2: జెడ్పీహెచ్‌ఎస్‌ మొగుళ్లపల్లి, జెడ్పీహెచ్‌ఎస్‌ పీఎంశ్రీ చెల్పూర్‌(గణపురం), జెడ్పీహెచ్‌ఎస్‌ పీఎంశ్రీ గొల్లబుద్దారం(భూపాలపల్లి)

అర్బన్‌: కేటగిరి 1: ఎంపీపీఎస్‌ సెగ్గంపల్లి (భూపాలపల్లి), ఎంజేపీటీబీఆర్‌ బాలికలు గాంఽధీనగర్‌ (భూపాలపల్లి)

నేడు అవార్డుల పంపిణీ

జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయాలకు నేడు(శనివారం) జిల్లా అవార్డులను అందించునున్నారు. 8 పాఠశాలలకు నేడు విద్యాశాఖ ఆధ్యర్యంలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ అవార్డులు ప్రదానం చేయనున్నారు.

రాష్ట్ర స్థాయికి ఎంపికై న పాఠశాలలు జాతీయ స్థాయికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి పాఠశాలలో స్వచ్ఛత, ప రిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.

– రాజేందర్‌, ఇన్‌చార్జ్‌ డీఈఓ

జాతీయ స్థాయికి ఎంపికై తే

కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు

స్వచ్ఛ్‌ విద్యాలయాలు1
1/1

స్వచ్ఛ్‌ విద్యాలయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement