పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలలో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. పోస్టల్ బ్యాలెట్‌కు అర్హత ఉన్న సిబ్బంది తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాలల్లో ఏర్పాటు చేసిన ఫెలిసిటీషన్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. నేటి నుంచి (శనివారం) 8వ తేదీ వరకు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెలిసిటీషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలి
గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు కేటాయించిన సిబ్బంది నేడు (శనివారం) జరగనున్న శిక్షణ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌శర్మ సూచించారు. శిక్షణ తరగతులకు హాజరు విషయంలో మినహాయింపు ఉండదని, గైర్హాజరైన పక్షంలో ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కేటాయించిన శిక్షణా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో శిక్షణ చాలా కీలకమని సూచించారు.
నిబంధనలకు లోబడి ఖర్చుపెట్టాలి
సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గరిష్ట ఖర్చు పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. 5వేల జనాభా కలిగిన గ్రామాల్లో రూ.2.50లక్షలు, 5వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ రూ.1,50లక్షలు, వార్డుసభ్యులు 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీ రూ.50వేలు, 5వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీ రూ.30వేల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ రాహుల్‌శర్మ
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి


