ఆస్ట్రేలియాలోని ఎన్నారైల సహకారం మరువలేనిది : లక్ష్మీపార్వతి | Australia NRI contribution is Exceptional says Lakshmi Parvati | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలోని ఎన్నారైల సహకారం మరువలేనిది : లక్ష్మీపార్వతి

Nov 22 2025 6:31 PM | Updated on Nov 22 2025 7:05 PM

Australia NRI contribution is Exceptional says Lakshmi Parvati

గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి  అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోనీ మెల్బోర్న్ పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి గారు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.  

ఈ సందర్బంగా సీనియర్ నాయకులని ఉద్దేశించి  లక్ష్మీపార్వతి  మాట్లాడుతూ  పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతు తీర్చుకుంటామని తెలియజేశారు.  మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసిపి నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల  తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెల్బోర్న్ టీం వైయస్ఆర్సీపీ సభ్యులకు ఆస్ట్రేలియా సీనియర్ వైసీపీ లీడర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement