బిబిసి (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువెంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకె నలుమూలనుండి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన కల్పించి , దాన్ని ఎలా నిర్ములించుకోవాలో సూచనలు చేసి ,చారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాంతో ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన వంద మందికి పైగా పురుషులు హాజరైనారు. .
ఈ ఈవెంట్‌లో భాగంగా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి 809 GBP(85 K INR)** పౌండ్స్ కు పైగా సేకరించారు.. నవంబరు నెల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అంకితం చేయబడినందున తాము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నడకను కూడా ప్రారంభించామని నిర్వాహకుతు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి ,చారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో ప్రోస్టేట్ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి , రెండు తెలుగు రాష్ట్రాలలో, యుకెలో ఆర్ధికంగా ఆదుకుంటున్నామనీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు బి.బి.సి కోర్ టీం ఉన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి వినమ్ర పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు.


