భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనూహ్యంగా గురువారం అర్ధరాత్రి చారిత్రక మాన్‌హట్టాన్ సబ్‌వే స్టేషన్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంపై అటు నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
న్యూయార్క్ మేయర్ ప్రమాణ స్వీకార వేడుకను ఆయన స్నేహితురాలు లెటిటియా జేమ్స్ నిర్వహించారు. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్దదే కాదు.. విలాసవంతమైన నగరానికి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఖురాన్ పై చేయి ఉంచి ఆయన ప్రమాణం చేసిన ఆయన.. తన జీవిత కాలంలో లభించిన అరుదైన గౌరవంగా చెప్పారు. అంతేకాదు.. కొత్త రవాణా శాఖ కమిషనర్‌గా మైక్ ఫ్లిన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉగాండ-భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మేయర్ పదవిని దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం గానూ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగానూ జోహ్రాన్ మమ్దానీ నిలిచారు.
🚨BREAKING: Zohran Mamdani, a 34-year-old immigrant from Uganda, just made history as the first Muslim, first South Asian, and youngest in a century to become Mayor of New York City.
He was sworn in alongside his wife minutes into the new year of 2026 by NYS AG Letitia James. pic.twitter.com/NHgE6NVK5l— CALL TO ACTIVISM (@CalltoActivism) January 1, 2026
మమ్దానీ తండ్రి మహమూద్ మమ్దానీ ఉగాండా జాతీయుడు. తల్లి ప్రముఖ ఇండియన్ సినీ డైరెక్టర్ మీరానాయర్. కాగా, మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 50.40 శాతం ఓట్లు (10,36,051) పోల్ అయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమోకు 41.6 శాతం ఓట్లు (8,54,995) వచ్చాయి. దాదాపు 1.81 లక్షల ఓట్ల మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 7.10% (1,46,137) ఓట్లు వచ్చాయి.
నవంబర్ 4వ తేదీన జరిగిన ఈ ఎన్నికలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 56 ఏండ్లలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా తరఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో జోహ్రాన్‌ను చిత్తుగా తిట్టారు. అయినా కూడా జోహ్రాన్‌నే విజయం వరించింది.
అయితే.. ఆ మధ్య వైట్‌హౌజ్ వెళ్లి ట్రంప్‌ను కలిసి కాసేపు భేటీ అయ్యాడు మమ్దానీ. ఆ సమయంలో న్యూయార్క్ అభివృద్ధికి కలిసి పని చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు.


