ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. సందర్భమేదైనా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, బిటికాయిన్, ఎథీరియం వంటి క్రిప్టో కరెన్సీపై తన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. న్యూయార్క్ నగరానికి కొత్త మేయర్‌గా జోహ్రాన్ మామ్దానీ (Zohran Mamdani) ఎన్నికైన సందర్భంగా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాజగా ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు.
‘మార్క్సిస్ట్ మామ్దానీ న్యూయార్క్ మేయర్ అయ్యారా? అతను రెంట్ స్టెబిలిటీని పెంచుతారని న్యూయార్క్ వాసులకు తెలుసా?’ అంటూ ట్వీట్ చేశారు. అద్దెపై నియంత్రణ అన్నది మార్క్సిస్ట్ సిద్ధాంతమని, దానర్థం అపార్ట్‌మెంట్ తరాలుగా అద్దెకుండేవారి చేతుల్లోనే ఉండిపోతుందని, ఓనర్లు మాత్రం హక్కులు కోల్పోతారని హెచ్చరించారు.
అన్నింటికీ మార్క్సిస్ట్ ప్రభుత్వమే యాజమాని అయ్యేటప్పుడు ఇక ప్రజలు దేనికైనా ఓనర్లుగా ఉండటం ఎందుకు? అంటున్నారు. అమెరికా స్వేచ్ఛ, పెట్టుబడి వ్యవస్థ కోల్పోంతోందని, మార్క్సిస్ట్ దేశంగా మారిపోతోందని అసంతృప్తిని వెలిబుచ్చారు. వామపక్ష ప్రభుత్వం నడిపే స్కూళ్లలో ఆర్థిక బోధన ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, అసలైన ఆర్థిక జ్ఞానంతో మిమ్మిల్ని మీరు రక్షించుకోవాలని తన ఫాలోవర్లకు సూచించారు. రియల్ మనీ గురించి తెలుసుకోవాలన్నారు. బంగారం, వెండిని (gold and silver) దేవుని సొమ్ముగా, బిట్కాయిన్, ఎథీరియంను ప్రజా సొమ్ముగా అభివర్ణించారు.
OMG: Marxist Momdami Mayor of NYC? Don’t New Yorkers know that he will increase “Rent Stability” which is Marxist and means;
1: Infinite Rent Control…. Which means a renter has control of their apartment for generations. A person can pass on their apartment to their kids,…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 5, 2025


