అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్ మేయర్‌గా ఎన్నికైన డెమొక్రటిక్ సోషలిస్ట్, భారతీయ అమెరికన్ యువకుడు జొహ్రాన్ మమ్దాని.. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవనున్నారు. ఈరోజు(శుక్రవారం) డొనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు మామ్దాని.
అయితే న్యూయార్క్ మేయర్‌గా మామ్దాని ఎన్నిక కావడానికి ముందు, ఆ తర్వాత ఆయనపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. అతనొక కమ్యూనిస్టు అని ఒకవైపు, అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన కూడా మాట్లాడారు.
అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్‌సెన్స్ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా మామ్దానీపై విరుచుకుపడుతూనే ఉన్నారు ట్రంప్. న్యూయార్క్ అభివృద్ధికి సంబంధించి నిధులు ఆపేస్తున్నారని మామ్దానీ సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు వైట్‌హౌస్‌లో ముఖాముఖి ఎదురపడటం ఇదే తొలిసారి. ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయి. దానికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
మామ్దానీ వైట్‌హౌస్‌కి వస్తున్న వేళ కూడా సెటైర్లు పడ్డాయి. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిత్.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పెద్ద నగరమైన న్యూయార్క్‌కు మేయర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు మామ్దానీ వైట్‌హౌస్‌కు వస్తున్నారంటూ సెటైర్ల వేశారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీ ఒక్కరితోనూ మాట్లాడాతారంటూ చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ట్రంప్ ఎవరితోనైనా మాట్లాడతారంటూ మామ్దానీని తక్కువగా చేసి వ్యాఖ్యలు చేశారు.


