జొహన్నెస్‌బర్గ్: జీ20 శిఖరాగ్రం విషయంలో అమెరికా మనసు మార్చుకుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా చెప్పారు. ఇప్పటి వరకు శిఖరాగ్రాన్ని బాయ్‌కాట్ చేస్తామని చెప్పిన అగ్రరాజ్యం ఇప్పుడు పాల్గొనేందుకు సానుకూలత వ్యక్తపర్చిందని ఆయన అన్నారు. ఆఖరి క్షణంలో ఈ మేరకు తమకు సందేశం అందడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను మారుస్తున్నామన్నారు.
మైనారిటీ శ్వేత జాతీయులపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నందున తాము ఆ దేశంలో జరిగే జీ20 శిఖరాగ్రాన్ని బహిష్కరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెల్సిందే. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.


