 
													తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కలిశారు. గురువారం రాత్రి ముంబైలో సీఎంతో కొంత సమయం పాటు సల్మాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ పేరిట ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో రాష్ట్ర పౌరులు తమ ఆలోచనలు, సూచనలను ఈ సర్వేలో చెప్పవచ్చు. దీనిని అందరికీ తెలిసేలా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సల్మాన్ కూడా తెలంగాణ గురించి స్పందించారు. రాష్ట్రం చాలా వేగవంతంగా పురోగతి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ సందేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
