యూపీలో రైలు ప్రమాదం.. భక్తులు మృతి | Train Accident At Uttar Pradesh Mirzapur | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రైలు ప్రమాదం.. భక్తులు మృతి

Nov 5 2025 11:12 AM | Updated on Nov 5 2025 1:26 PM

Train Accident At Uttar Pradesh Mirzapur

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం..మీర్జాపూర్‌లోని చునర్‌ రైలు స్టేషన్‌లో ప్రయాణీకులను రైలు ఢీకొట్టింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి వచ్చిన భక్తులు రైలు ఆగిన వెంటనే ప్లాట్‌ఫామ్‌ ఉన్న వైపు కాకుండా పట్టాలు ఉన్న వైపునకు దిగారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న రైలు.. పట్టాలు దాటుతున్న భక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాద కారణంగా రైల్వేస్టేషన్‌లో పట్టాలపై మృతదేహాలు  చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించి సహాయక చర్యలకు ఆదేశించారు. 

ఇదిలా ఉండగా.. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. నిన్న ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రైలు కోర్బా జిల్లాలోని గెవరా నుంచి బిలాస్‌పుర్‌కు వెళ్తుండగా.. గటోరా- బిలాస్‌పుర్‌ స్టేషన్‌ మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటనా స్థలంలో రైల్వేశాఖ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రయాణికుల రైలు రెడ్‌ సిగ్నల్‌ను దాటి ముందుకు వెళ్లడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement