వాషింగ్టన్: అమెరికా స్థానిక ఎన్నికల్లో ఫలితాలు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని షాకిచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటర్లు ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలను ఓడించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై తాజాగా ట్రంప్ స్పందించారు.
అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో ట్రంప్ ఫొటో లేదు. అమెరికాలో షట్‌డౌన్ ఉంది. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ఇవే రెండు ముఖ్య కారణాలు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
( @realDonaldTrump - Truth Social Post )
( Donald J. Trump - Nov 04, 2025, 10:05 PM ET )
“TRUMP WASN’T ON THE BALLOT, AND SHUTDOWN, WERE THE TWO REASONS THAT REPUBLICANS LOST ELECTIONS TONIGHT,” according to Pollsters. pic.twitter.com/l3sMRCplPk— Fan Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) November 5, 2025
గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమి
వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమి
వర్జీనియా గవర్నర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్
వర్జీనియా తొలి మహిళా గవర్నర్‌గా అబిగైల్ స్నాన్‌బర్గర్ రికార్డు
సిన్సినాటి మేయర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలుపు
అట్లాంటా మేయర్‌గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నిక
పిట్స్‌బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం
రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ..
వర్జీనియాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రిపబ్లికన్ పార్టీ సీయర్స్ ఓటమి పాలవ్వగా.. డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్నాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్ కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. అబిగైల్ 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్ గా అబిగైల్ చరిత్ర సృష్టించారు.
జేడీవాన్స్ తమ్ముడికీ తప్పని ఓటమి..
మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీబౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమొక్రాట్ అఫ్తాబ్ పురేవాల్ గెలుపొందారు. పురేవాల్ రెండవ సారి మేయర్ గా ఎన్నికయ్యారు. తొలిసారి 2021లో మేయర్‌గా ఎన్నికయ్యారు. మే నెలలో జరిగిన ఆల్ పార్టీ మున్సిపల్ ప్రైమరీలో ఆయన 80% కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.


