అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. | US Cargo Plane Crashes Near Louisville Airport | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..

Nov 5 2025 7:44 AM | Updated on Nov 5 2025 8:38 AM

US Cargo Plane Crashes Near Louisville Airport

వాషింగ్టన్‌: అమెరికా (USA)లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కెంటకీ విమానాశ్రయంలో టేకాఫ్‌ సమయంలో కార్గో విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. అమెరికాలోని లూయిస్‌విల్లేలో టేకాఫ్‌ సమయంలో యూపీఎస్‌ కార్గో విమానం కుప్పకూలింది. యూపీఎస్‌ ఫ్లైట్‌ నంబర్‌ 2976 విమానం హోనులులుకు మంగళవారం సాయంత్రం (అమెరికా కాలమానం) 5.15కు బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధ్రువీకరించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించినట్టు వెల్లడించింది. 

 

ఇక, విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కాగా, ఈ విమానం మెక్‌డోనెల్‌ డగ్లస్‌ ఎండీ-11 రకానికి చెందినది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement