breaking news
cargo plane
-
సముద్రంలో పడిపోయిన విమానం
-
ఎయిర్‌పోర్టులో కార్గో ‘సింహం’
హైదరాబాద్: ప్రపంచంలో అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘అంటనోవ్–124 రస్లాన్’ శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తొలిసారి అడుగుపెట్టింది. రస్లాన్ అంటే తుర్కీ భాషలో సింహం అని అర్థం. ఇది అత్యధిక సరుకు సామర్థ్యం కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు పెట్టారు. అబుదాబి నుంచి భారీ సరుకుతో బయలుదేరిన ఈ విమా నం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై అడుగు పెట్టింది. ఇక్కడ సరుకులు దించిన తర్వా త తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు టేకాఫ్ తీసుకుని దుబాయ్ బయలుదేరింది. అంటనోవ్– 124 రస్లాన్ విమానాలు ప్రస్తుతం క్రియాశీలకంగా 26 మాత్రమే పని చేస్తున్నాయని సమాచారం. ఈ ఫ్లైట్ ప్రత్యేకతలివీ.. ఈ విమానానికి నాలుగు అతిపెద్ద టర్బో ఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. 150 టన్నుల కార్గోని మోసుకెళ్లడం దీని ప్రత్యేకత. మలీ్టలెగ్ ల్యాండింగ్ గేర్ కలిగి ఉంటుంది. రెక్కల వైశాల్యం 6760 చదరపు అడుగులు. ఖాళీ విమానం బరువు 1,81,000 కిలోలు. గతంలో.. శంషాబాద్ విమానాశ్రయంలో 2016 మే 13 అంటనోవ్– 225 మ్రియా విమానం చెక్ రిపబ్లిక్ నుంచి బయలుదేరి ఆ్రస్టేలియాలోని పెర్త్‌కు భారీ జనరేటర్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో విశ్రాంతి కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండయింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానం. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 2022 ఫిబ్రవరి ఇది పూర్తిగా ధ్వంసమైంది. దీని తర్వాత అతి పెద్ద విమానాల్లో ఒకటైన బెలుగా విమానం 2022, 2023, 2024లలో నాలుగు విదేశాలకు బయలుదేరుతూ ఇక్కడ ల్యాండై బయలుదేరాయి. తాజాగా అంటనోవ్–124 రస్లాన్ ఎయిర్‌పోర్టులో సరుకులు దించి ఇక్కడి నుంచి దుబాయ్‌కు వెళ్లింది. -
పాక్‌కు సైనిక సామగ్రి తరలింపు అబద్ధం: చైనా
బీజింగ్: పాకిస్తాన్‌కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జియాన్ వై–20 రకం విమానంలో పెద్ద మొత్తంలో సామగ్రిని పాకిస్తాన్ తరలించినట్లు ఆన్లైన్లో వస్తున్న వార్తలు అసత్యాలని పేర్కొంది. ‘ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు. సైనిక సంబంధమైన వదంతులను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిని బాధ్యులను చేస్తాం’అని స్పష్టం చేసింది. భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరాక పాక్‌కు అత్యవసరమైన సామగ్రిని చైనా పంపించిందంటూ ఆన్లైన్లో వార్తలు షికారు చేశాయి. పాక్, చైనాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. పాక్ ఆయుధ సామగ్రి, వ్యవస్థల్లో ఏకంగా 81 శాతం చైనా నుంచి కొనుగోలు చేసినవేనని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) తెలిపింది. -
విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో అమెరికాకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం టేకాఫ్ అయి ఫ్యూక్టోరికాకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే ఆకాశంలో ఉండగా ఇంజన్లో లోపం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6 — Noorie (@Im_Noorie) January 19, 2024 విమానంలో మంటలో చెలరేగటంతో ఆ విమానాన్ని వెంటనే సురక్షింగా మియామి ఎయిర్ట్లోనే ల్యాడింగ్ చేయించామని అట్లాస్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కారణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని మియామి ఎయిర్ పోర్టు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఆకాశంలో ఉన్న విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
పైలట్ రహిత ప్రయాణం
మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్‌పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్‌తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్తో కలిసి పని చేస్తోంది. మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్‌కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్‌క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వారెవ్వా.. శంషాబాద్ రన్‌వేపై బెలుగా ఎయిర్‌బస్.. అదిరిపోయిందిగా! (ఫొటోలు)
-
నింగి నుంచి నీళ్లలోకి...!
దక్షిణ ఫ్రాన్స్‌లోని మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యాక రన్‌వే దాటి దూసుకెళ్లి సరస్సులోకి దూసుకెళ్లింది ఓ సరకు రవాణా విమానం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో బోయింగ్ 737 కార్గో విమానంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. విమానాన్ని తొలిగంచే వరకు ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని సరస్సులోకి దూసుకెళ్లగా విమానంలోని ఒక ఇంజిన్ నీటిలో మునిగిపోయింది. శనివారం తెల్లవారుజామున పారిస్ ఛార్లెస్ డీ గౌల్లే ఎయిర్పోర్ట్ నుంచి మోంట్‌పిల్లర్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ⚠️ Accident du @BoeingFrance #737 immatriculé EC-NLS exploité par #WestAtlantic / sortie de piste pendant atterrissage survenue le 24/09/22 à l’aéroport de @mplaeroport / 4 enquêteurs @BEA_Aero sur place / ouverture d’une enquête de sécurité. pic.twitter.com/H76U3BbRxk — BEA ✈️ ⚙️🔬🇫🇷 (@BEA_Aero) September 24, 2022 ఇదీ చదవండి: 8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ -
రన్‌వే మీద రెండు ముక్కలైన విమానం.. వీడియో
రన్ వేపై ఓ విమానం రెండు ముక్కలైంది. గురువారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన వెంటనే ఈ ఘటన చోసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన డీచ్‌ఎల్ బోయింగ్ 757 కార్గో విమానం.. కోస్టారికాలోని సాన్ జోస్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరింది. అయితే కాసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తిందని పైలెట్.. అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ పర్మిషన్ కోరాడు. దీంతో అధికారులు అనుమతి ఇచ్చారు. తీరా.. ఎయిర్‌పోర్టుకు తిరిగి వచ్చిన ఆ కార్గో విమానం రన్‌వేపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత రెండు ముక్కలైంది. అందులోంచి పైలట్లు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తిందని, అందుకే ఈ ఘటన చోటు చేసుకుందని ఎయిర్పోర్ట్ అధికారులు వివరించారు. అయినప్పటికీ ఈ ఘటనపై హైలెవల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు వివరించారు. Video footage of the DHL Boeing 757 Freighter just as it skidded off the runway at SJO. Read more at AviationSource!https://t.co/63ONa6oRCD Source: Unknown#DHL #JuanSantamariaAirport #AvGeek #Crash #Accident pic.twitter.com/EI9ew6YVXN — AviationSource (@AvSourceNews) April 7, 2022 -
రాష్ట్రానికి చేరుకున్న వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు
విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో రోగుల అవసరాల నిమిత్తం 70 వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు బుధవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్ 32 కార్గో విమానంలో ఇక్కడికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లారీలో విజయవాడకు తరలించారు. కాగా, ఆక్సిజన్ దిగుమతి కోసం బుధవారం మరో రెండు ఖాళీ ట్యాంకర్లను ఐఏఎఫ్ సీ–17 కార్గో విమానంలో భువనేశ్వర్ విమానాశ్రయానికి అధికారులు తరలించారు. -
రష్యాకు మందులు తీసుకెళ్లిన ఏరోఫ్లోట్
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మొదటిసారిగా రష్యాకు చెందిన ఫ్రైటర్ సర్వీస్ ఏరోఫ్లోట్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. 1923 నుంచి ఆపరేట్ అవుతున్న, ప్రపంచంలోనే అత్యంత పురాతన ఫ్రైటర్ సర్వీస్‌లలో ఒకటైన ఈ 50 టన్నుల కార్గో విమానం హైదరాబాద్ నుంచి మాస్కోకు వివిధ రకాల మందులను, వ్యాక్సిన్లను మోసుకెళ్లింది. రష్యా ఫెడరేషన్‌కు చెందిన అతి పెద్ద కమర్షియల్ కార్గో సర్వీస్ అయిన ఈ ఏరోఫ్లోట్ (ఎస్‌యూ 7012/ 7013) ఈ నెల 5న ఉదయం 11.17 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రి 12.03 గంటల సమయంలో తిరిగి వెళ్లింది. ఈ విమానంలో దాదాపు 20 రకా ల ఔషధాలు, వ్యాక్సిన్లను రష్యాకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఫ్రైటర్ సర్వీస్ కరోనా లాక్డౌన్ కాలానికి మాత్ర మే పరిమితమైనా, దీనిని వారానికి ఒకసారి నడిచే ఫ్రైటర్ సర్వీసుగా మార్చేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం ఫలిస్తే, హైదరాబాద్ నుంచి రష్యా, ఇతర కామన్వెల్త్ దేశాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని విమానాశ్రయ అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు లాక్డౌన్ దృష్ట్యా హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు ఎయిర్ కార్గో ద్వారా పెద్దఎత్తున నిత్యావసరాలు, రిలీఫ్ సరుకులైన ఔషధా లు, ఇంజనీరింగ్, ఐటీ, ఏరోస్పేస్, కన్సోల్ కార్గో రవాణా జరుగుతోంది. లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5,500 టన్నుల కార్గో రవాణా చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
పాక్ నుంచి విమానం.. అడ్డుకున్న ఐఏఎఫ్
జైపూర్: పాకిస్తాన్ వైపు నుంచి అనుమతి లేని వాయుమార్గంలో భారత భూభాగంలోకి ప్రవేశించిన జార్జియన్ ఆంటొనోవ్-12 కార్గో విమానాన్ని భారత వాయిసేన గగణతలంలో అడ్డుకుంది. ఐఏఎఫ్ సుఖోయ్‌లు కార్గో విమానాన్ని అడ్డుకుని జైపూర్ ఎయిర్ బేస్‌లో విమానాన్ని దింపింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జైపూర్‌లో చోటుచేసుకుంది. అనంతరం విమాన సిబ్బందిని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కచ్ ప్రాంతంలోని రణ్‌లో కీలకమైన ఎయిర్ బేస్‌కు 70 కిలోమీటర్ల ఉత్తరంగా ఎఎన్-12 కార్గో భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే స్పందిన ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది.. విమానాన్ని అడ్డుకుని జైపూర్ బేస్‌లో దింపింది. విమానంలో ఉన్న సామగ్రిని తనిఖీ చేసేందుకు, వారి నుంచి మరిన్ని వివారలను రాబట్టేందుకు ఐఏఎఫ్ తమ బృందాన్ని జైపూర్‌కు పంపింది. కార్గో విమానాన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ తమ రాడార్లలో గుర్తించడంతో వివానాన్ని అడ్డుకోగలిగామని ఎయిర్‌పోర్స్ సిబ్బంది తెలిపింది. #WATCH: Indian Air Force fighter jets force an Antonov AN-12 heavy cargo plane coming from Pakistani Air space to land at Jaipur airport. Questioning of pilots on. pic.twitter.com/esuGbtu9Tl — ANI (@ANI) May 10, 2019 -
ఇరాన్లో కూలిన కార్గో విమానం
టెహ్రాన్: ఇరాన్లో మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. దశాబ్దాల క్రితం నాటి బోయింగ్ 707 కార్గో విమానం మాంసం లోడ్‌తో సోమవారం కిర్గిస్తాన్ నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు బయలుదేరింది. పాయం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం అత్యవసరంగా ఉదయం 8.30కి ఫత్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో రన్‌వేపై అదుపు తప్పింది. దీంతో స్థానికంగా ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడ్డాయి. పాయంలో దిగాల్సిన విమానం పొరపాటున ఫత్లో దిగినట్లు ఓ ఏవియేషన్ అధికారి తెలిపినట్లు ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. 2016 నుంచి ఈ బోయింగ్ విమానం కిర్గిస్తాన్ నుంచి ఇరాన్‌కు మాంసం రవాణా చేస్తుంది. ఇరాన్లో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఏళ్లపాటు కొనసాగిన అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ కొత్త విమానాలను కొనుగోలు చేసుకోలేకపోయింది. -
రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం
-
రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం
రోమ్: ఇటలీలో ఓ విమానం రోడ్డెక్కింది. రన్ వేను దాటుకుంటూ వచ్చిన విమానం రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చింది. దీంతో ఖిన్నులైన రోడ్డు వాహనాదారులు తమ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేశారు. అయితే, పేలుడులాంటి సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డీహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737-400 అనే కార్గో విమానం తెల్లవారు జామున ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే క్రమంలో రన్ వేను దాటుకుంటూ నియంత్రణ కోల్పోయి రయ్‌మంటూ రోడ్డెక్కింది. ఈ ప్రమాదం జరగడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా కొన్నిగంటలు మూసి వేసి అనంతరం తెరిచారు. ప్రమాదానికి గురైన విమానం ప్యారిస్ నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. విమాన సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మీడియా ప్రతినిధులు చెప్పారు. -
కుప్పకూలిన విమానం; 36 మంది మృతి
36 మంది మృతి.. సూడాన్‌లో దుర్ఘటన జుబా: ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్‌లో బుధవారం ఓ రవాణా విమానం కూలిపోయింది. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయానికి సుమారు 800 మీటర్లదూరంలోనే నైలునదిలోని ఓ చిన్న ద్వీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో సుమారు 36 మంది వరకు మృతిచెందినట్టు తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి సహాయంతో నడుస్తున్న రేడియో మరియా తెలిపింది. విమానం కూలిన ద్వీపంలో కొన్ని రైతు కుటుంబాలు జీవిస్తున్నాయని, విమానం కూలినకారణంగా దానికిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోందని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. కాగా, విమానం శకలాలు నది వెంట చెల్లాచెదురుగా పడ్డాయని ఆ వార్తలు తెలిపాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారని ఓ వార్తాసంస్థ విలేకరి తెలిపారు. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సూడాన్‌లో జుబా విమానాశ్రయం రద్దీగా ఉంటుంది. పలు వాణిజ్య, రవాణా విమానాలే కాకుండా మిలిటరీ విమానాలు కూడా ఇక్కడినుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ద్వీపం వద్ద కూలి ముక్కలుచెక్కలైన విమానం. పక్కన పడి ఉన్న మృతదేహాలు -
సూడాన్‌లో కూలిన విమానం