కూలిన సైనిక విమానం.. 20మంది దుర్మరణం? | Turkish military cargo plane crashed in Georgia | Sakshi
Sakshi News home page

కూలిన సైనిక విమానం.. 20మంది దుర్మరణం?

Nov 11 2025 9:40 PM | Updated on Nov 11 2025 9:42 PM

Turkish military cargo plane crashed in Georgia

టిబిలిసీ: జార్జియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టర్కీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ-130 సైనిక విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో మంటలు అంటుకుని పశ్చిమ జార్జియాలోని ఓ పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న మొత్తం 20 మంది ఉన్నట్లు తెలుస్తోంది

ప్రభుత్వ వర్గాల ప్రకారం.. విమానం గాల్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. కుప్పకూలిన వెంటనే స్థానిక రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే ప్రాణనష్టం వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ప్రమాద తీవ్రతను బట్టి  మరణాల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా.  ఈ ఘటనపై టర్కీ, జార్జియా ప్రభుత్వాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. 

మరోవైపు ప్రయాణికులతో వెళ్తున్న విమానానికి గాల్లో ఉండగా మంటలు అంటుకున్నాయి. ప్రమాద తీవ్రతతో విమానం గాల్లో  నుంచి ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన టర్కీ సైనిక విమానాల భద్రతపై తీవ్ర ప్రశ్నలు 
లేవనెత్తుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement