సిరియాలో దారుణం జరిగింది. హోమ్స్ సిటీలో శుక్రవారం సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనల చేస్తున్న సమయంలో బాంబు పేలింది. ఈ దుర్ఘటనో ఎనిమిది మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే మసీదులో బాంబు అమర్చి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఈ ఘటనను అక్కడి ప్రభుత్వం ఖండించింది. ఇది పిరికపంద చర్యని పేర్కొంది. ఇటువంటి చర్యలు సిరియాలో ప్రభుత్వాన్ని పౌరుల భద్రతను విఫలం చేయవని పేర్కొంది. ప్రజలలో అయోమయాన్ని, భయాన్ని సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వారి ప్రయత్నాలు ఫలించవని ప్రభుత్వం పేర్కొంది.
కాగా మసీదు బాంబు దాడి ప్రాథమిక విచారణలో బాంబులు అమర్చినట్లు తేలిందని అధికారులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


