ప్రపంచంలో 10 పవర్‌ఫుల్‌ మిలిటరీ దేశాలు | Global Fire Power Rankings 2024: USA Tops, India Holds 4th Spot Among Strongest Militaries | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో 10 పవర్‌ఫుల్‌ మిలిటరీ దేశాలు

Nov 14 2025 2:44 PM | Updated on Nov 14 2025 3:02 PM

Global Firepower Military Strength Rankings 2025 top 10 check list

2025 గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళాల తాజా ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ ఫైర్ పవర్ (Global Fire Power) వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో యునైటెడ్ స్టేట్స్ (USA) అగ్రస్థానంలో ఉండగా, భారత్ సైనిక బలం పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది.

నివేదికల ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ ఈ సంవత్సరం 145 దేశాల సాయుధ దళాలను వారి వనరులు,  యుద్ధ పరికరాల ఆధారంగా అంచనా వేసింది. దళాల బలం, ఆర్థిక స్థితి, వనరులతో సహా 60కి పైగా ప్రమాణాలను లెక్చించి, ఆయా దేశాల మిలిటరీలను పోల్చి ర్యాంకింగ్‌ను కేటాయించింది. ఈ ర్యాంకింగ్‌లో దేశాల అణు సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

టాప్ 10 అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశాలు

1. యునైటెడ్ స్టేట్స్ (USA)-1వ ర్యాంకు

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.0744

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా ర్యాంక్ పొందింది. 2024 లో 873 బిలియన్‌ డాలర్లు దాటిన ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్‌ను కలిగి ఉంది.

2. రష్యా-2వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788

విస్తారమైన అణ్వాయుధాలు కలిగి ఉంది. విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకుల పరంగా ఇది రెండో స్థానంలో ఉంది.

3. చైనా: 3వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788

పవర్ ఇండెక్స్‌లో రష్యాకు సమానంగా ఉంది.

4. భారతదేశం: 4వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1184

సైనిక బలం పరంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది.

5. దక్షిణ కొరియా: 5వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1656

6. యునైటెడ్ కింగ్‌డమ్ (UK): 6వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1785

7. ఫ్రాన్స్: 7వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1878

8. జపాన్: 8వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1839

9. టర్కీ: 9వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.1902

ఫ్రిగేట్ నౌకాదళాలు, హెలికాప్టర్లు, నావికాదళ కార్వెట్లు, జలాంతర్గాములు వంటివి అధికంగా ఉన్నాయి.

10. ఇటలీ: 10వ స్థానం

పవర్ ఇండెక్స్ స్కోరు: 0.2164

ఇదీ చదవండి: ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement