రాష్ట్రానికి చేరుకున్న వెంటిలేటర్లు, లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలు | Ventilators, life support equipment reached to AP | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి చేరుకున్న వెంటిలేటర్లు, లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలు

May 20 2021 5:29 AM | Updated on May 20 2021 5:29 AM

Ventilators, life support equipment reached to AP - Sakshi

వెంటిలేటర్లు, లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలను తీసుకొచ్చిన విమానం

విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో రోగుల అవసరాల నిమిత్తం 70 వెంటిలేటర్లు, లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలు బుధవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్‌ 32 కార్గో విమానంలో ఇక్కడికి  తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లారీలో విజయవాడకు తరలించారు. కాగా, ఆక్సిజన్‌ దిగుమతి కోసం బుధవారం మరో రెండు ఖాళీ ట్యాంకర్లను ఐఏఎఫ్‌ సీ–17 కార్గో విమానంలో భువనేశ్వర్‌ విమానాశ్రయానికి అధికారులు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement