ఇరాన్‌లో కూలిన కార్గో విమానం

15 dead in Boeing 707 cargo plane crash in northern Iran - Sakshi

15 మంది దుర్మరణం

టెహ్రాన్‌: ఇరాన్‌లో మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. దశాబ్దాల క్రితం నాటి బోయింగ్‌ 707 కార్గో విమానం మాంసం లోడ్‌తో సోమవారం కిర్గిస్తాన్‌ నుంచి ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు బయలుదేరింది. పాయం విమానాశ్రయంలో ల్యాండ్‌ కావాల్సిన ఈ విమానం అత్యవసరంగా ఉదయం 8.30కి ఫత్‌ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేస్తున్న క్రమంలో రన్‌వేపై అదుపు తప్పింది.

దీంతో స్థానికంగా ఉన్న ఇళ్లలోకి దూసుకెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగిసిపడ్డాయి. పాయంలో దిగాల్సిన విమానం పొరపాటున ఫత్‌లో దిగినట్లు ఓ ఏవియేషన్‌ అధికారి తెలిపినట్లు ఇరాన్‌ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది. 2016 నుంచి ఈ బోయింగ్‌ విమానం కిర్గిస్తాన్‌ నుంచి ఇరాన్‌కు మాంసం రవాణా చేస్తుంది. ఇరాన్‌లో విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఏళ్లపాటు కొనసాగిన అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్‌ కొత్త విమానాలను కొనుగోలు చేసుకోలేకపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top