రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం | Sakshi
Sakshi News home page

రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం

Published Fri, Aug 5 2016 2:50 PM

రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చిన విమానం - Sakshi

రోమ్: ఇటలీలో ఓ విమానం రోడ్డెక్కింది. రన్ వేను దాటుకుంటూ వచ్చిన విమానం రోడ్డుపైకి అడ్డంగా దూసుకొచ్చింది. దీంతో ఖిన్నులైన రోడ్డు వాహనాదారులు తమ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేశారు. అయితే, పేలుడులాంటి సంఘటన చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

డీహెచ్ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737-400 అనే కార్గో విమానం తెల్లవారు జామున ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే క్రమంలో రన్ వేను దాటుకుంటూ నియంత్రణ కోల్పోయి రయ్మంటూ రోడ్డెక్కింది. ఈ ప్రమాదం జరగడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా కొన్నిగంటలు మూసి వేసి అనంతరం తెరిచారు. ప్రమాదానికి గురైన విమానం ప్యారిస్ నుంచి వచ్చినట్లు అధికారులు చెప్పారు. విమాన సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని మీడియా ప్రతినిధులు చెప్పారు.

Advertisement
Advertisement