
తొలిసారి వచ్చిన అతిపెద్ద ఫ్లైట్
అంటనోవ్– 124 రస్లాన్ ఇక్కడ సరుకు దింపి
దుబాయ్‌కి బయలుదేరిన విమానం
హైదరాబాద్: ప్రపంచంలో అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘అంటనోవ్–124 రస్లాన్’ శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో తొలిసారి అడుగుపెట్టింది. రస్లాన్ అంటే తుర్కీ భాషలో సింహం అని అర్థం. ఇది అత్యధిక సరుకు సామర్థ్యం కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు పెట్టారు. అబుదాబి నుంచి భారీ సరుకుతో బయలుదేరిన ఈ విమా నం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై అడుగు పెట్టింది. ఇక్కడ సరుకులు దించిన తర్వా త తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు టేకాఫ్ తీసుకుని దుబాయ్ బయలుదేరింది. అంటనోవ్– 124 రస్లాన్ విమానాలు ప్రస్తుతం క్రియాశీలకంగా 26 మాత్రమే పని చేస్తున్నాయని సమాచారం.
ఈ ఫ్లైట్ ప్రత్యేకతలివీ..
ఈ విమానానికి నాలుగు అతిపెద్ద టర్బో ఫ్యాన్ ఇంజిన్‌లు ఉంటాయి.
150 టన్నుల కార్గోని మోసుకెళ్లడం దీని
ప్రత్యేకత. మలీ్టలెగ్ ల్యాండింగ్ గేర్ కలిగి ఉంటుంది.
రెక్కల వైశాల్యం 6760 చదరపు అడుగులు. ఖాళీ విమానం బరువు 1,81,000 కిలోలు.
గతంలో..
శంషాబాద్ విమానాశ్రయంలో 2016 మే 13 అంటనోవ్– 225 మ్రియా విమానం చెక్ రిపబ్లిక్ నుంచి బయలుదేరి ఆ్రస్టేలియాలోని పెర్త్‌కు భారీ జనరేటర్ తీసుకెళుతుండగా మార్గమధ్యలో విశ్రాంతి కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండయింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విమానం. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 2022 ఫిబ్రవరి ఇది పూర్తిగా ధ్వంసమైంది. దీని తర్వాత అతి పెద్ద విమానాల్లో ఒకటైన బెలుగా విమానం 2022, 2023, 2024లలో నాలుగు విదేశాలకు బయలుదేరుతూ ఇక్కడ ల్యాండై బయలుదేరాయి. తాజాగా అంటనోవ్–124 రస్లాన్ ఎయిర్‌పోర్టులో సరుకులు దించి ఇక్కడి నుంచి దుబాయ్‌కు వెళ్లింది.