భర్త, కుటుంబ క్షేమాన్ని కోరుతూ మహిళలు చాలా వ్రతాలు, పూజలు చేస్తుంటారు. తాజాగా జరిగిన కర్వాచౌత్ కూడా అలాంటిదే..!
తమ జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ సినీ సెలబ్రిటీలందరూ కర్వాచౌత్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
ఉదయం నుంచి ఉపవాసం ఉన్న హీరోయిన్లు.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొన్నారు.
ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకొనే ఈ పండగను ఇప్పుడు దక్షిణాదిన కూడా కొంతమంది జరుపుకొంటున్నారు.
రోజంతా ఉపవాసం చేసిన మహిళలు.. సాయంత్రం జల్లెడలో చంద్రుడిని చూసి.. ఆపై భర్త ముఖాన్ని చూసి దీక్ష విరమిస్తారు.
కర్వా చౌత్ సందర్భంగా మహిళలు పార్వతీ మాతను పూజిస్తారు.
తమ పసుపు కుంకుమలు కలకాలం సురక్షితంగా ఉండాలని ఉపవాస దీక్ష చేసి ఆ అమ్మను వేడుకుంటారు.


