Banjara Hills: ఎవరిదా స్థలం.. ఎందుకీ వివాదం? | Banjara Hills Road No.10 Ten Acres Land Issuse, More Details Inside | Sakshi
Sakshi News home page

Banjara Hills: ఎవరిదా స్థలం.. ఎందుకీ వివాదం?

Oct 11 2025 7:10 AM | Updated on Oct 11 2025 11:46 AM

Banjara Hills Road No10 Ten acres land Issuse

బంజారాహిల్స్‌ రోడ్డు నెం.10లో పది ఎకరాలు  

గతంలో ఖరీదు చేసిన రాధిక హౌసింగ్‌ సొసైటీ  

నాటకీయ పరిణామాలతో కోర్టుకు చేరిన వ్యవహారం  

దిన్ని ఆసరాగా చేసుకుని కన్ను వేసిన పార్థసారథి  

ఇప్పటికే ఆయనపై స్థానిక ఠాణాలో పలు కేసులు 

 హైడ్రా జోక్యంతో కొలిక్కివచ్చిన వైనం  

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం.. రోడ్డు నెం.10లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు (టీజీఐసీసీసీ) కూతవేటు దూరం.. రూ.వందల కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం.. ఏళ్లుగా ఓ సొసైటీకి–ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదం.. దీన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పత్రాలతో సగం స్థలంలో తిష్ట వేసిన వైనం.. హైడ్రా అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్న పది ఎకరాల స్థలం వెనుక ఉన్న కథ ఇది. కొన్నేళ్లుగా రెవెన్యూ, జలమండలి, పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ కబ్జా బాగోతం హైడ్రా జోక్యంతో కొలిక్కిరావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

నాలుగు దశాబ్ధాల క్రితం మొదలై.. 
సదరు స్థలాన్ని శ్రీ రా«ధిక కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ 1981లో ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి ఖరీదు చేసింది. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ద రఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును తిరస్కరించిన ప్రభుత్వం అది సర్కారు భూమిగా పేర్కొంది. ఆపై ఈ పది ఎకరాలతో పాటు మొత్తం 30 ఎకరాలను బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌తో పాటు మరో రెండు సొసైటీలకు కేయించింది. తమ స్థలం కేటాయింపును రాధిక సొసైటీ హైకోర్టులో సవాల్‌ చేసింది. దీంతో ఆ 10 ఎకరాల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది.  

మ్యుటేషన్‌ చేయాలన్న సింగిల్‌ బెంచ్‌.. 
అదే సందర్భంలో ఆ పది ఎకరాలను రాధిక సొసైటీకి మ్యుటేషన్‌ చేయాలంటూ సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచి్చంది. దీన్ని ప్రభుత్వం అప్పీల్‌ చేయడంతో విచారించిన ఇరువురు జడ్జీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫుల్‌ బెంచ్‌కు నివేదించారు. వివాదాన్ని సివిల్‌ కోర్టులో పరిష్కరించుకోవాలంటూ అభిప్రాయపడ్డారు. అప్పటికే ఈ వివాదం మొదలై 20 ఏళ్ల కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ఫుల్‌ బెంచ్‌ విచారణకు మరింత కాలయాపన సరికాదని అభిప్రాయపడుతూ గతంలో సొసైటీలకు ఇచి్చన రేటుకే రెగ్యులరైజ్‌ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరింది. దీనికి అప్పట్లో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) కూడా సమ్మతి తెలిపారు.  

సుప్రీం కోర్టు నుంచి మళ్లీ హైకోర్టుకు.. 
ఈ ఉత్తర్వులను ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. అక్కడి పిటిషన్, రివ్యూ, క్యూరేటివ్‌లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాధిక సొసైటీకే రెగ్యులరైజ్‌ చేయాలంటూ స్పష్టం చేసింది. 2017లో ప్రభుత్వం మరోసారి అది ప్రభుత్వ భూమి అంటూ మెమో జారీ చేయడంతో వివాదం మొదటికి వచ్చింది. దీన్ని కొట్టేసిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సుప్రీం ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల్ని సర్కారు డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. దీంతో ఈ పది ఎకరాల వివాదం ప్రస్తుతం మళ్లీ హైకోర్టు పరిధిలోకి చేరింది. ఈ స్థలం నుంచే గతంలో జలమండలికి ఎకరం, ఆపై మరో ఎకరం కేటాయించింది.

జాగిలాలు.. చుట్టూ సీసీ కెమెరాలతో... 
ఈ స్థలంలోని ఐదు ఎకరాలపై కన్నేసిన పార్థసారథి, తన కుమారుడు విజయ్‌ భార్గవ్‌ చుట్టూ షీట్లు వేశారు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ అది తమదే అంటూ రంగంలోకి దిగారు. అందులో 10 వేట కుక్కలు, 25 మంది తమ మనుషులు, పది మంది బౌన్సర్లను ఏర్పాటు చేశారు. స్థలం చుట్టూ దాదాపు 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ అధీనంలో ఉంచుకున్నారు. దీనిపై ఇప్పటికే బంజారాహిల్స్‌ ఠాణాలో నాలుగు కేసులు నమోదు కాగా... 2021లో అరెస్టు కూడా అయ్యారు. వీరిపై శంకర్‌పల్లిలోనూ మూడు ఎకరాలు కబ్జాకు ప్రయత్నించిన ఆరోపణలు ఉన్నాయి. జలమండలి, రెవెన్యూ, పోలీసులను ధిక్కరిస్తూ తమ ఆధిపత్యం చూపించిన వీరి వ్యవహారాలకు హెడ్రా ఎంట్రీతో చెక్‌ పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement