breaking news
Ten acres of land
-
Banjara Hills: ఎవరిదా స్థలం.. ఎందుకీ వివాదం?
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం.. రోడ్డు నెం.10లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (టీజీఐసీసీసీ) కూతవేటు దూరం.. రూ.వందల కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం.. ఏళ్లుగా ఓ సొసైటీకి–ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదం.. దీన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పత్రాలతో సగం స్థలంలో తిష్ట వేసిన వైనం.. హైడ్రా అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్న పది ఎకరాల స్థలం వెనుక ఉన్న కథ ఇది. కొన్నేళ్లుగా రెవెన్యూ, జలమండలి, పోలీసులకు తలనొప్పిగా మారిన ఈ కబ్జా బాగోతం హైడ్రా జోక్యంతో కొలిక్కిరావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నాలుగు దశాబ్ధాల క్రితం మొదలై.. సదరు స్థలాన్ని శ్రీ రా«ధిక కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1981లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఖరీదు చేసింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ద రఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును తిరస్కరించిన ప్రభుత్వం అది సర్కారు భూమిగా పేర్కొంది. ఆపై ఈ పది ఎకరాలతో పాటు మొత్తం 30 ఎకరాలను బసవతారకం కేన్సర్ హాస్పిటల్‌తో పాటు మరో రెండు సొసైటీలకు కేయించింది. తమ స్థలం కేటాయింపును రాధిక సొసైటీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఆ 10 ఎకరాల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది. మ్యుటేషన్ చేయాలన్న సింగిల్ బెంచ్.. అదే సందర్భంలో ఆ పది ఎకరాలను రాధిక సొసైటీకి మ్యుటేషన్ చేయాలంటూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచి్చంది. దీన్ని ప్రభుత్వం అప్పీల్ చేయడంతో విచారించిన ఇరువురు జడ్జీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో ఫుల్ బెంచ్‌కు నివేదించారు. వివాదాన్ని సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలంటూ అభిప్రాయపడ్డారు. అప్పటికే ఈ వివాదం మొదలై 20 ఏళ్ల కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ఫుల్ బెంచ్ విచారణకు మరింత కాలయాపన సరికాదని అభిప్రాయపడుతూ గతంలో సొసైటీలకు ఇచి్చన రేటుకే రెగ్యులరైజ్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరింది. దీనికి అప్పట్లో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కూడా సమ్మతి తెలిపారు. సుప్రీం కోర్టు నుంచి మళ్లీ హైకోర్టుకు.. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అక్కడి పిటిషన్, రివ్యూ, క్యూరేటివ్లను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాధిక సొసైటీకే రెగ్యులరైజ్ చేయాలంటూ స్పష్టం చేసింది. 2017లో ప్రభుత్వం మరోసారి అది ప్రభుత్వ భూమి అంటూ మెమో జారీ చేయడంతో వివాదం మొదటికి వచ్చింది. దీన్ని కొట్టేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ సుప్రీం ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల్ని సర్కారు డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీంతో ఈ పది ఎకరాల వివాదం ప్రస్తుతం మళ్లీ హైకోర్టు పరిధిలోకి చేరింది. ఈ స్థలం నుంచే గతంలో జలమండలికి ఎకరం, ఆపై మరో ఎకరం కేటాయించింది.జాగిలాలు.. చుట్టూ సీసీ కెమెరాలతో... ఈ స్థలంలోని ఐదు ఎకరాలపై కన్నేసిన పార్థసారథి, తన కుమారుడు విజయ్ భార్గవ్ చుట్టూ షీట్లు వేశారు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ అది తమదే అంటూ రంగంలోకి దిగారు. అందులో 10 వేట కుక్కలు, 25 మంది తమ మనుషులు, పది మంది బౌన్సర్లను ఏర్పాటు చేశారు. స్థలం చుట్టూ దాదాపు 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ అధీనంలో ఉంచుకున్నారు. దీనిపై ఇప్పటికే బంజారాహిల్స్ ఠాణాలో నాలుగు కేసులు నమోదు కాగా... 2021లో అరెస్టు కూడా అయ్యారు. వీరిపై శంకర్పల్లిలోనూ మూడు ఎకరాలు కబ్జాకు ప్రయత్నించిన ఆరోపణలు ఉన్నాయి. జలమండలి, రెవెన్యూ, పోలీసులను ధిక్కరిస్తూ తమ ఆధిపత్యం చూపించిన వీరి వ్యవహారాలకు హెడ్రా ఎంట్రీతో చెక్ పడింది. -
పదెకరాలకు ఏడాది అద్దె రూ.30!
బౌరింగ్‌క్లబ్ కాంట్రాక్టును రద్దు చేయండి ఈ అవినీతిలో బీబీఎంపీ అధికారుల హస్తం బీజేపీ బీబీఎంపీ సభ్యుడు పద్మనాభరెడ్డి బనశంకరి: నగర నడిబొడ్డును ఉన్న పది ఎకరాల స్థలాన్ని బీబీఎంపీ కేవలం ఏడాదికి రూ. 30లకు అద్దెకు ఇచ్చింది. బౌరింగ్ ఇన్సిటిట్యూట్ క్లబ్ కు ఇచ్చిన ఈ కంటాక్ట్ను రద్దు చేయాలని బీజేపీ నేత, బీబీఎంపీ సభ్యుడు పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘1956 అప్పటి సిటీ కార్పొరేషన్ ఈ క్లబ్‌ను యే డాదికి రూ.30 కాంట్రాక్టుకు ఇవ్వడం చట్టవిరుద్ధం, ప్రజావ్యతిరేకం. కార్పొరేషన్ మొ త్తం 99 ఏళ్లకు కాంట్రాక్టు ఇచ్చింది. దీనిని కౌన్సిల్ సభ్యుడు దయానంద్ వ్యతిరేకిస్తూ 10 ఏళ్లకే ఆ కంట్రాక్టు ఇవ్వాలని కౌన్సిల్ వాదించాడు. ఆయన నిర్ణయాన్ని ఏకీభవిస్తూ నా లుగు ఓట్లు, వ్యతిరేకిస్తూ 19 ఓట్లు పడ్డాయి. ప్రభుత్వం కూడా కౌన్సిల్ నిర్ణయానికి ఒప్పుకొని 99 ఏళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. బౌరింగ్ ఇన్సిటిట్యూట్ క్లబ్‌పై పూర్తి విచారణ చేపట్టాలి. అలాగే ఆ స్థలాన్ని బీబీఎంపీ స్వాధీనం చేసుకోవాలి. బౌరింగ్‌క్లబ్ పాలకమండలి నిబంధనలు ఉల్లంఘించి పెట్రోల్ బంక్, హాప్‌కామ్, డిపార్టుమెంటల్స్టోర్, కేక్శాప్, పిష్కౌంటర్, క్యాంటిన్, సెలూన్ దుకాణాలకు అద్దెకు ఇచ్చింది. అద్దె రూపంలో లక్షలాది రూపాయలను వసూలు చేస్తోంది. ప్రతి నెలా పెట్రోల్ బంక్ నుంచి రూ. లక్షను అద్దెగా తీసుకుం టోంది. నాలుగేళ్లు క్రితం డిసెంబరు 17 బౌరింగ్‌క్లబ్ పెట్రోల్ బంక్ అద్దెలో 50 శాతం ప్రభుత్వానికి చెల్లించలేదు. కంట్రాక్టు ప్రకారం జెడ్ ప్రదేశాల్లో కట్టడాలు నిర్మించరాదంటూ ఈ కంట్రాక్టుకు ఎందుకు రద్దు చేయకూడదని అని నోటీసులు పంపినా రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టలేదు. బౌరింగ్క్లబ్లో అన్ని నిబంధనలు ఉల్లంఘించి పలు కట్టడాలు నిర్మించారు. ఈ అక్రమాల్లో బీబీ ఎంపీ అధికారుల పాత్ర కూడా ఉంది. రూ. ఐదు కోట్ల విలువ చేసే బీబీఎంపీ ఆస్తిని కేవలం శ్రీమంతుల ఆనందం కోసం కంట్రాక్ట్‌కు ఇవ్వడం సరికాదు. ఆ కంట్రాక్టును రద్దు చేసి ప్రజల ఉపయోగాల కోసం వినియోగించాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణం జోక్యం చేసుకోవాలి...* అని డిమాండ్ చేశారు. తక్కువ అద్దె ఉండవచ్చు: మేయర్ బీబీఎంపీ సభ్యుడు పద్మనాభరెడ్డి ఆరోపణలపై మేయర్ శాంతకుమారిని ఫోన్లో వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ ...‘ ప్రస్తుతం నా వద్ద ప్రాథమిక సమాచారం మేరకు బౌరింగ్ క్లబ్‌కు అద్దె చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పగలను. అయితే స్పష్టమైన సమాచారంతో శనివారం ఇందుకు సమాధానం ఇస్తాను.’ అని తెలిపారు.


