
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో 162 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వివరాల ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న ఇండిగో విమానానికి పక్షి తగిలింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన పైలట్.. ఎంతో చాకచక్యంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ విమానంలో 162 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది. పైలట్ సమయ స్పూర్తితో వీరంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎంతో సురక్షితంగా విమానం ల్యాండ్ అవడంతో అటు ప్రయాణికులతో పాటు ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.