సోమవారం నుంచి అమల్లోకి...
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల (రిజిస్ట్రేషన్ నంబర్లు) రుసుములను రవాణా శాఖ సవరించింది. కొన్నింటి రుసుములు పెంచగా, మరికొన్ని నెంబర్ల రుసుములను తగ్గించింది. ఎక్కువ నెంబర్లకు సంబంధించిన రుసుములు భారీగా పెరిగాయి. వాహనదారులు ఎక్కువగా కోరుకునే నెంబర్లలో కొన్నింటికి సంబంధించి మార్పుచేర్పులు చేసింది. వెరసి ఆదాయాన్ని పెంచుకోబోతోంది. గత ఆగస్టులో ఈ సవరణకు సంబంధించిన డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలుంటే తెలపాల్సిందిగా రవాణాశాఖ కోరింది. ఎలాంటి అభ్యంతరాలు రానందున, శనివారం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.


పైన పేర్కొన్న ఫ్యాన్సీ నెంబర్లు కాకుండా ఆరోజు విడుదల చేసిన మిగతా నెంబర్ల నుంచి ఛాయిస్ నంబర్ ఎంచుకునేందుకు ఆరువేలు, ద్విచక్ర వాహనాలకైతే మూడు వేలుగా ధర నిర్ణయించారు.


