సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. డిసెంబర్ మాసానికి సంబంధించి రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. పెండింగ్ బిల్లులు ఆగస్టు నుంచి ప్రతినెల కనీసం రూ.700 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తోంది. విడుదలైన బిల్లుల్లో గ్రాట్యూటీ, జీపీఎఫ్ -సరెండర్ లీవులు, అడ్వాన్స్‌లు ఉన్నట్లు సర్కార్ వెల్లడించింది.
ప్రతినెల రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని గతంలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ నెలాఖరులో రూ.183 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్ట నుంచి ప్రతి నెలా నిధులను విడుదల చేస్తోంది. ఇవాళ రూ.713 కోట్లను విడుదల చేసింది.


