అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Meets Ministers Over Municipal Election Results | Sakshi
Sakshi News home page

అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు: సీఎం రేవంత్‌

Feb 14 2026 9:10 PM | Updated on Feb 14 2026 9:14 PM

CM Revanth Reddy Meets Ministers Over Municipal Election Results

రేవంత్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులతో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో మంత్రులందరినీ సీఎం అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు సీఎం రేవంత్‌. 

దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించాం. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. 

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement