సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల వేళ మందుబాబులకు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చక్రవ్యూహంలో దొరికితే డైరెక్ట్ చంచల్‌గూడ జైలుకే వెళ్తారు అని హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మరోసారి వీసీ సజ్జనార్ స్పందిస్తూ.. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈరోజు రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని తెలిపారు. ఈ తనిఖీలు కేవలం ఈ రోజుకే పరిమితం కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తామని, అలాగే కోర్టు ద్వారా జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రక్రియను చేపడతామని హెచ్చరించారు.
ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. చక్రవ్యూహంతో సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరుగుతాయి. చక్రవ్యూహం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. చక్రవ్యూహంలో దొరికితే డైరెక్ట్ చంచల్‌గూడ జైలుకే వెళ్తారు. తాగి డ్రైవింగ్ చేస్తే నో షార్ట్ కట్స్.. నో స్మార్ట్ మూవ్స్ అంటూ హెచ్చరించారు.
#NewYear ki best resolution: taagi drive cheyyakudadhu.
If you try to outsmart us after a few drinks, think twice! Our strategic drunk-driving checks are like a #Chakravyuh—once you get behind the wheel after drinking, there’s no escape.
In this Chakravyuh, the exit doesn’t… https://t.co/ZpNHRzDA5G— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 31, 2025
అలాగే, కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే కాకుండా అతివేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో నలుగురికి ఇబ్బంది కలిగించేలా న్యూసెన్స్ చేయడం వంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. మద్యం సేవించిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి, స్వయంగా డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ సేవలను లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి క్షేమంగా, సంతోషంగా జరుపుకోవాలని పోలీస్ యంత్రాంగం కోరింది. ర్యాష్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


