హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ జోష్ లిక్కర్ అమ్మకాల ద్వారా స్పష్టంగా కనబడుతోంది. రికార్డుస్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలోనే గత ఏడాది రికార్డును ఈ ఏడాది అమ్మకాలు దాటేశాయి. ఇప్పటికే రూ. 5 వేల కోట్లు లిక్కర్ సేల్స్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
కొత్త మద్యం పాలసీతో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈరాత్రి అమ్మకాల తర్వాత మరింతగా లిక్కర సేల్స్ పెరగనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే వెయ్యి కోట్లు అదనంగా మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం.


