సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు అనేక ప్రత్యేక పథకాలను ప్రకటించింది. పోలీస్, విజిలెన్స్, ఏసీబీ, ఫైర్ సర్వీసెస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి ఈ పథకాలు వర్తించనున్నాయి. విశిష్ట సేవలు అందించిన సిబ్బందిని గౌరవించేందుకు నగదు పురస్కారాలు, పింఛన్ పథకాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ప్రకటించిన పథకాలు
- తెలంగాణ శౌర్య పథకం – నెలకు రూ. 500 పింఛన్ + రూ.10,000 నగదు
- మహోన్నత సేవ పథకం – రూ.40,000 ఒకేసారి నగదు
- ఉత్తమ సేవ పథకం – రూ.30,000 నగదు
- కటినా సేవ పథకం – రూ.20,000 నగదు
- తెలంగాణ సేవ పథకం – రూ. 20,000 నగదు
ఈ పథకాలు పోలీస్, ఫైర్, విజిలెన్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఎం సర్వోన్నత పోలీస్ పథకం
న్యూ ఇయర్ డే సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక అవార్డులను కూడా ప్రకటించారు. CRO సెల్, ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఎస్‌ఐ మణీష్ కుమార్ లఖానీ విశిష్ట పోలీస్ సేవలకు గాను సీఎం సర్వోన్నత పోలీస్ పథకం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డులో భాగంగా ఆయనకు రూ. 5 లక్షల నగదు బహుమతి ప్రదానం చేయబడింది.


