సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దు అయ్యాయి. సాంకేతిక లోపంతో విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఢిల్లీ, ముంబై, శివమొగ్గ విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్-కౌలాలంపూర్, వియత్నాం-హైదరాబాద్-గోవా విమానాల్లో సాంకేతిక లోపం ఏర్పడింది. పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక లోపంతో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. 24 గంటల్లో 800 విమానాలు ఆలస్యం నడిచాయి. 26 విమానాలను రద్దు చేశారు. ఆటోమేటెడ్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్‌లో సమస్యలు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపాలను అధికారులు పరిష్కరిస్తున్నారు. పూర్తి సాధారణ స్థితికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


