
నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు కదం తొక్కారు. ఎన్–బ్రాండ్ లిక్కర్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో కడపలోని ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం పారబోసి నిరసన తెలిపారు. అనంతరం అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, నకిలీ మద్యం ఎక్కడపడితే అక్కడే దొరుకుతోందన్నారు.

అనంతరం చంద్రబాబు ఫ్లెక్సీకి మద్యంతో అభిషేకం చేసి నినాదాలు చేశారు.












