breaking news
AP Spurious Liquor Racket
-
ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన గ్రహణమేమిటో?
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? ఒకపక్క నకిలీ మద్యం.. ఇంకోపక్క కలుషిత నీరు. ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అవుతోంది. ప్రభుత్వానికేమో ఏదీ పట్టదాయె! అధికార పార్టీ తన దందాల్లో బిజీ!. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు వద్ద నకిలీ మద్యం ప్లాంట్‌ను గుర్తించడం తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు అద్దం పడుతోంది. అలాగే ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కూడా. రాష్ట్రంలో అనకాపల్లి, పాలకొల్లు, గూడూరుల్లోనూ నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కూడా ఒక టీడీపీ నాయకుడి డంప్ ఒకటి బయటపడింది. వీటి పుణ్యమా అని ఏపీలో కల్తీ మద్యం ఏరులైపారుతోందన్నది కళ్ల ముందే కనిపిస్తోంది. ఎన్ని లక్షల మంది అనారోగ్యం పాలయ్యారో తెలియని పరిస్థితి. కల్తీ మద్యం అమ్మకాలకు ఒక నెట్ వర్క్.. తెలుగుదేశం నేతల అండ ఉండవచ్చని తెలుస్తోంది(AP Spurious Liquor Racket). జగన్ టైమ్‌లో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా ఇప్పుడు నిమ్మకు నీరెత్తితే ఒట్టు. పైగా నిందితులు వైసీపీ వారన్న కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు వెంటనే మొదలుపెట్టింది. తంబళ్లపల్లెలో టీడీపీ పక్షాన పోటీ చేసిన జయచంద్రా రెడ్డి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడని, ఆయనే టీడీపీలోకి పంపించారని చిత్రమైన ప్రచారం ఆరంభించింది. చంద్రబాబును కాపాడేందుకా? అన్నట్టు నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవదన్నారని కథనాలు వండి వార్చింది. అన్ని కోణాలలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అన్నారట. నిష్పక్షపాతం వరకు ఓకే గాని, అన్ని కోణాల్లో అనడంలోనే మతలబు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మంత్రులకూ సంబంధం ఉన్న ఈ కేసు నిందితులను చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. పైకి తూతూ మంత్రంగా తంబళ్లపల్లె ఇన్‌ఛార్జి జయచంద్రా రెడ్డి, సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ ప్రకటించింది. వీరికీ చంద్రబాబు, లోకేశ్‌లకు ఉన్న దగ్గరి సంబంధాలు, కలిసి దిగిన ఫొటోలిప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. జగన్ సీఎంగా ఉండగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. ఈ క్రమంలో వేలాది దుకాణాలను దక్కించుకున్న టీడీపీ నేతలు ఇతరులకు దక్కకుండా ఎమ్మెల్యేల చేత భయపెట్టించిన వార్తలూ మనం చూశాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూములు కాస్తా మినీబార్లుగా మారాయి. వీటికి లెక్కకు మిక్కిలి బెల్ట్ షాపులు వెలిశాయి. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాపులు ఉండగా..రాష్ట్రం మొత్తమ్మీద వీటి సంఖ్య లక్షకు మించిపోయాయని తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే మీడియానే అంచనా వేస్తోంది. ఈ బెల్ట్ షాపులతోపాటు అనుమతి కలిగిన మద్యం దుకాణాలకూ కల్తీమద్యం సరఫరా అయి ఉంటుందన్నది కొందరి అనుమానం. ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులు కొంతమందికి లైసెన్స్డ్ వైన్ షాపులు కూడా ఉండటం గమనార్హం.అప్పట్లో చంద్రబాబు నాసిరకం మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారని నిరాధారంగా ఆరోపిస్తే(Chandrababu AP Spurious Liquor Racket Drama).. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా చిలువలు వలువలు చేసింది. టీడీపీ నేతలు స్వయంగా విషపూరిత మద్యం సరఫరా వెనుక ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్‌కే రంగులు, ఎస్సెన్స్‌లు కలిపి, గుర్తింపు పొందిన బ్రాండ్ల బాటిళ్లలో నింపి మార్కెట్ లోకి వదలుతున్నట్లు వెల్లడవుతోంది. నాణ్యమైన మద్యం రూ.99 రూపాయలకే ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరీ గద్దెనెక్కిన కూటమి నేతలిప్పుడు ఏకంగా విషం ఇస్తున్నారని వీటి బారినపడి ఎన్నివేల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంతమంది అకాల మృత్యువుకు గురయ్యారో ఎవరూ చెప్పలేకపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి పాలనలో నకిలీ మద్యం ఒక పరిశ్రమగా(Kutami Prabhutvam Fake Liquor) వర్ధిల్లుతోందని, ప్రజలకు ఉపాధి, మేలు కలిగించే పరిశ్రమలు ఏవీ రావడం లేదని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకున్నారంటూ ఒక కల్పిత స్కామ్ ను సృష్టించి ఎవరెవరిపైనో దాడులు చేస్తూ, పలువురు ప్రముఖులపై కేసులు పెట్టిన చంద్రబాబు సర్కార్, ఇంత పెద్ద నకిలీ మద్యం స్కామ్ జరిగితే ఆ స్థాయిలో విచారణ చేయించే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు.ములకల చెరువు నకిలీ మద్యం దందా విలువ సుమారు రూ.6,000 కోట్లంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్సైజ్ అధికారులకు వెయ్యి లీటర్లకుపైగా స్పిరిట్, వేల బాటిళ్ల నకిలీ మద్యం పట్టుబడడం, జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే అన్ని రకాల యంత్ర సామాగ్రీ, హంగులతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారంటే.. పై స్థాయి నుంచి గట్టి మద్దతే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో జనార్ధనరావు అనే నిందితుడికి విజయవాడ వద్ద కూడా ఒక బార్ లైసెన్స్ ఉందట. ఈయన తంబళ్లపల్లెకు వెళ్లి ఈ నకిలీ మద్యం ప్లాంట్ పెట్టడానికి ఎవరి అండ ఉందన్నది దర్యాప్తు చేయవలసిన అధికారులు ఆ పని చేస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములకల చెరువు కేసులో అసలు సూత్రధారులను తప్పించేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన డైరీలోని వివరాలు, పేర్లు ఎవరివి? సూత్రధారులు ఎవరు? వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? అన్న అంశాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఎందుకు నియమించలేదు?.. ఒక వేళ నిజంగానే సిట్ ను ఏర్పాటు చేసినా, వారికి స్వేచ్చ ఉంటుందా?.. మరో వైపు కలుషిత నీరు వల్ల కురుపాం వద్ద గిరిజన విద్యార్థుల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్ధులు మరణించారు. సుమారు వంద మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు సమీపంలోని తురకపాలెం గ్రామంలో 24 మంది అంతుపట్టని వ్యాధితో మృతి చెందారు. దీనికీ కలుషిత నీరే కారణం కావచ్చని భావిస్తున్నారు. మంచినీరు దొరుకుతుందో లేదో కాని, మద్యం విచ్చలవిడిగా పారుతోంది. దానికి తోడు విషపూరితమైన నకిలీ బ్రాండ్లు అడ్డూ, ఆపు లేకుండా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . ఫలితంగా అనేక అనర్ధాలు సమాజంలో ఏర్పడుతున్నాయి.అందువల్లే ఏపీకి ఏమైంది? అని ఆందోళన చెందాల్సి వస్తోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నకిలీ మద్యం కేసు: నాగరాజు అరెస్ట్.. సీఐపై హిమబిందుపై వేటు
ములకలచెరువు/మదనపల్లె/గన్నవరం/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో ప్రధాన నిందితుడు కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ ప్లాంట్‌లో కూలీలను సమకూర్చడంతోపాటు నకిలీ మద్యం రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సీఐ హిమబిందు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని వేరుగా అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా తేలిన వారి సంఖ్య 14 మంది. తొలిరోజు 10 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన నలుగురిలో కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేశారు. కొడాలి శ్రీనివాసరావు, జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, విదేశాల్లో ఉన్న జనార్దనరావు అరెస్ట్ కావాల్సి ఉంది. కాగా.. ఇదే కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చబోతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఆ ఏడుగురు ఎవరన్నది చర్చనీయాంశమైంది. కాగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన కల్తీ మద్యం తయారీ కేసులో మద్యం నింపేందుకు ఖాళీ బాటిళ్లను సరఫరా చేసిన సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్‌కు చెందిన శ్రీనివాసరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మద్యం నింపేందుకు వినియోగించిన 90 ఎంఎల్ (క్వార్టర్) ఖాళీ బాటిళ్లను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లోని శ్రీనివాస పెట్ బాటిల్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మంగళవారం ఆ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు కంపెనీ నిర్వాహకుడైన గుంటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులకు 17 వరకు రిమాండ్ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసిన ముగ్గురికి కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాధల్ దాస్, ప్రతాప్దాస్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంగళవారం 6వ ఎంఎం ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా, ముగ్గురికీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.అధికార పార్టీ నేతల్ని వదిలేసి.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు మదనపల్లె: అధికార పార్టీ పెద్దల అండదండలతో సాగిన నకిలీ మద్యం దందాలో అసలైన సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి ఎక్సైజ్ అధికారిపై వేటు వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ దందా నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ హిమబిందును విజయవాడ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఇప్పుడు వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఎక్కడో అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తుంటేనే దాడులు చేసే ఎక్సైజ్ అధికారులకు ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గురించి తెలియక పోవడం విడ్డూరం అని ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఐపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అందరిపై అన్ని విధాలా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం, బెల్డ్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు.. ఇలా ఇన్ని జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలుపుతోంది. -
నకిలీ మద్యానికి నలుగురు బలి
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ములకలచెరువులో వ్యక్తి మృతిశ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.నెల్లూరు జిల్లాలో ఇద్దరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్‌షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్‌పై పామూరుకు చెందిన పవన్ మెన్స్‌వేర్ లేబుల్‌ను గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం ఆదాయం బాబు మాఫియాకే: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసిన సీఎం చంద్రబాబునాయుడు ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఊరూరా 70 వేలకుపైగా బెల్టు షాపులను నెలకొల్పి పోలీసు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి మరీ మద్యం దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారని దుయ్యబట్టారు. వేలం పాటలు పాడి డబ్బులు వసూలు చేసి.. మంత్రులకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత.. అంటూ మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను వారి నియంత్రణలోకి తీసుకున్నారన్నారు. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రాణాలను హరిస్తున్నారన్నారు. కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీతో ఒకవైపు భారీగా దోపిడీ చేస్తూ మరోవైపు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు ర్యాండమ్‌గా జరిపిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ డంపులు భారీగా బహిర్గతమయ్యాయన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి సర్కారు ప్రజా కంటక పాలనపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ నిర్దేశించారు. కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్‌కు అందజేస్తామన్నారు. సమావేశంలో జగన్ ఏమన్నారంటే.మద్యం మాఫియా నెట్వర్క్ఇవాళ మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. మొత్తం వ్యవస్థను తమ కంట్రోల్లోకి తీసుకున్న తరువాత ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు. వైన్ షాపుల పక్కనే పర్మిట్ రూముల్లో పెగ్గుల రూపంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నారు. వేలంపాటలో గ్రామాల్లో బెల్ట్ షాపులు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో అక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ బ్రాండెడ్ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమీషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునే ఎత్తుగడలు.నకిలీ లిక్కర్ తయారీదారులు, విక్రేతలు అందరూ టీడీపీ వాళ్లేనని వివరిస్తూ నిందితుడు కట్టా సురేంద్రనాయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌తో ఉన్న ఫొటోలను చూపిస్తున్న వైఎస్ జగన్ నకిలీ మద్యంతో బరి తెగింపు.. బాబు పరిపాలనలో రాక్షసయుగంబాధ కలిగించే విషయం ఏమిటంటే.. వీళ్ల డబ్బు ఆశ ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. ప్రజలు ఏం తాగినా పర్వాలేదు... చనిపోయినా పర్వాలేదు.. తమ జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపుతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం నడుస్తోంది. భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారు. నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఆ మాఫియాను కంట్రోల్ చేసే కొందరు కేబినెట్ మంత్రులు, ప్రముఖ రాజకీయ పదవుల్లో ఉన్నవారు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు నెలకొల్పి క్వాలిటీ లేని లిక్కర్ తయారు చేసి వారి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా షాపుల్లోకి, బెల్ట్ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ.. పరిశ్రమను స్థాపించి యంత్ర పూజ...మరో విషయం ఏమిటంటే.. ఇవాళ ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిల్. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి అప్పగించారు. ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను స్థాపించి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో బయటపడిన నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలోని యంత్రాలు, మద్యం బాటిళ్ల ఫొటోలు చూపిస్తున్న వైఎస్ జగన్ ఒక్కో ఏరియా పంచుకున్నారు.. ఇబ్రహీంపట్నంలో రెండు భారీ డంప్లుఅధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు నెలకొల్పి ఒక్కొక్కరు ఒక్కో ఏరియా పంచుకున్నారు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్దన్‌రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేశ్, చంద్రబాబుతో కలసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ సరుకు రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్‌షాపులకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సూçపర్వైజ్ చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటూ బ్రాండ్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కార్టన్ బాక్సుల్లో స్పిరిట్ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిళ్లను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారట. నర్సీపట్నంకు చెందిన నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ.. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్ అన్నీ ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్ అన్నీ అమర్చుకున్నారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్, అనకాపల్లి జిల్లా పరవాడలో పరిశ్రమ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యానికి అమాయకులు బలి..ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాపులో లిక్కర్ తాగిన కొద్దిసేపటికే షేక్ చిన్న మస్తాన్ మరణించాడు. జూపూడి వైన్ షాప్‌లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు చనిపోయాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని వైన్ షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నకిలీ మద్యానికి అమాయకులు బలి అవుతున్నారు (ఆ ఫొటోలను పీపీటీలో చూపారు).అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం తయారీ నిందితుడు రుత్తల రాము శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని తెలిపే ఫొటో చూపిస్తున్న వైఎస్ జగన్ దాడుల్లో వేలాదిగా నకిలీ బాటిళ్లు స్వాధీనం..రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే.. సొంత ఆదాయాలు పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా అమాయకుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఇబ్రహీంపట్నంలోని గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్‌ను సీజ్ చేశారు. అందులో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్ బ్లూ 44 బాటిల్స్, కేరళ మాల్ట్ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్.. ఇలా మొత్తం 1,300 బాటిళ్లను ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. లేబుల్స్ లేని 136 కేసులు, 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్ 6,500, ఖాళీ బాటిల్స్ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.నకిలీ మద్యంపై ఆందోళన ఇలా..ప్రజల ప్రాణాలను హరిస్తున్న నకిలీ మద్యంపై పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి నాలుగైదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం విక్రయిస్తున్నారు. కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డులతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిగా చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి.నాడు.. పరిమిత వేళల్లో క్వాలిటీతో విక్రయాలు..మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్ ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్ జరిగేది. అది కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్ తర్వాత, దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది కాబట్టి ఇష్టారీతిన కాకుండా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పరిమితంగా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. మద్యం షాపులను 2,934కి తగ్గించాం. అక్రమ పర్మిట్ రూములతోపాటు 43 వేల బెల్టుషాప్‌లను పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. నాడు సరఫరా చేసిన లిక్కర్ బాటిళ్ల మీద క్యూఆర్ కోడ్ ఉండేది. వాటిని స్కాన్ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ నూటికి నూరు శాతం ఉండేది. -
‘ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీకి ట్రైనింగ్ తీసుకున్నారు’
తాడేపల్లి: డబ్బుకోసం ఏదైనా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధపడతారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అందుకు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడమే ఉదాహరణ అని పేర్ని నాని మండిపడ్డారు. ఈ రోజు(మంగళవారం, అక్టోబర్ 7వ తేదీ) తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ‘ ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్‌కాలేజ్ సందర్శనకు వైఎస్ జగన్ వెళ్తారు. మేము ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడతాం. ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ విధంగా ఉందో గవర్నర్‌కు చూపిస్తాం. మా హయాంలో మద్యం అమ్మకాలపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదేడిస్టరీలను కొనసాగించారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారవుతోంది. ఈ ప్రభుత్వానికి అంతిమ గడియలు వచ్చాయి. ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీకి టీడీపీ నేతలు ట్రైనింగ్ తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ మంత్రికి ముడుపులు అందుతున్నాయి’ అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు.. -
‘మందుబాబులకూ బాబు వెన్నుపోటు.. పవన్ ఇక కలుగు నాయుడే’
సాక్షి, కృష్ణా: చంద్రబాబు, పవన్, లోకేష్.. గత 16 నెలలుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ముందు సరసమైన ధరలకే నాణ్యమైన మద్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వం కూటిమిదే అని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఇక నుంచి కలుగు నాయుడు అని పిలవాలని అన్నారు. ఎన్నికల సమయంలో తప్ప ఆయన.. ఆ కలుగు నుంచి బయటకు రారంటూ సెటైర్లు వేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. అప్పట్నుంచి ప్రతీ ఒక్కరికీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. 85 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం వేస్తాను అన్నాడు. కేవలం 40 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. జగన్‌ను విమర్శించి.. ఇప్పుడు తల్లికి వందనంలో కోత పెట్టాడు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి 15 వేలు వేస్తానని చెప్పారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం కోతలు కోసి జగన్ వేసిన వారికే వేశారు. జగన్ వాహనమిత్ర వేసినప్పుడు హేళనగా నవ్వారు. ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా డ్రైవర్లందరికీ వెన్నుపోటు పొడిచాడు.పేదలకు ఇళ్లు ఇస్తానని చెప్పాడు కొత్త ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రజలకు పథకాలు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మందుబాబులకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. పవన్ కల్యాణ్‌ను ఇకపై కలుగు నాయుడు అని పిలవాలి. ఆ కలుగు నాయుడు కలుగులో నుంచి బయటకు రాడు. ఎన్నికలకు ముందు బయటకు వస్తాడు.. అరుస్తాడు, రెచ్చిపోతాడు. తలకాయ బాదుకుంటాడు.. ఊగిపోతాడు, తూగిపోతాడు, జుట్టు పీక్కుంటాడు. ఆడ పిల్లకు అన్యాయం జరుగుతుంటే.. అఘాయిత్యాలు జరుగుతుంటే కలుగులో నుండి బయటకు రాడు.వైఎస్ జగన్ ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్ లేదు, బ్యాక్ పైపర్, మాన్షన్ హౌస్ లేదన్నారు. మరి ఇప్పుడు దొరికే మందు పేరేంటి.. చంద్రబాబు బ్రాండేనా?. టీడీపీ ప్రభుత్వం ఆఫ్రికా నుండి కొత్త ఫార్ములా తెచ్చి కొత్త మందు అమ్ముతున్నారు. సూపర్ సిక్స్ బ్రాండ్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మందు అంటున్నారు. రాయలసీమలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 1, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని ఉందని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. టీడీపీ నాయకులను ఆఫ్రికా పంపి కల్తీ మద్యం తయారీ శిక్షణ ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రజలారా మద్యం సేవించడం మానేయండి. లేదా త్రాగకుండా ఉండలేకుంటే మాత్రం కొన్న బార్ వద్దే వాసన చూసి గుర్తుపట్టి తీసుకెళ్లండి. మీ కుటుంబం ముఖ్యం.. కల్తీ మందు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’ అని సూచించారు. -
నకిలీ మద్యం భారీ డంప
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి నెట్వర్క్: రంగు, వాసన, ఏమాత్రం తేడా లేకుండా కార్మెల్, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం తయారీ... ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్‌కు నకిలీ సరుకు సిద్ధం... అక్కడ ఎటుచూసినా.. కార్టన్ బాక్స్‌ల్లో స్పిరిట్ నింపిన క్యాన్లు.. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అతికించిన నకిలీ మద్యం బాటిళ్లే.. ఎవరికీ అనుమానం రాకుండా బాక్సుల్లో అమర్చి పాల వ్యాన్లలో సరఫరా! ఏకంగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నడుమ నకిలీ మద్యం తయారీ!విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా పచ్చముఠాలు, కల్తీ కేటుగాళ్లు సాగించిన నకిలీ మద్యం దందా ఇదీ!! తాజాగా అక్కడ తనిఖీల్లో భారీగా బయటపడ్డ స్పిరిట్ ఖాళీ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారంటే ఏ స్థాయిలో దందా సాగిందో ఊహించవచ్చు. పాత ఏఎన్నార్ బార్ భవనంలో నకిలీ తయారీ..టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాలవారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తోంది. బరి తెగించి అన్ని చోట్లా మద్యం, బెల్ట్ షాపులకు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసి రూ.కోట్లు పిండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో నకిలీ మద్యం తయారీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ సమీపంలోని గోడౌన్, హైవే పక్కన ఉన్న పాత ఏఎన్నార్ బార్ (ఖాళీ భవనం)లో సోమవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి.గోడౌన్లో సుమారు 162 కేసుల మద్యం సీసాలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్లు, మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, బ్లెండ్ (క్యారామిల్, రెక్టిఫైడ్ స్పిరిట్ ద్రావణం), పెద్ద సంఖ్యలో ఖాళీ సీసాలు, పలు కంపెనీల లేబుల్స్, సీసాలకు బిగించే మూతలు, మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్నార్ బార్ భవనంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్పిరిట్, క్యారామిల్ ద్రావణం కలిపేందుకు వినియోగిస్తున్న పీవీసీ ట్యాంక్, వివిధ రంగులు మిక్స్ చేసే యంత్రాలు లభ్యమయ్యాయి.రెండు గదుల నిండా ఉన్న స్పిరిట్ ఖాళీ క్యాన్లు, రెండు పెద్ద స్టీల్ డ్రమ్ములు, మద్యం తయారీ సామగ్రిని భవానీపురం ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఏడాదిన్నరగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ రాకెట్ నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నకిలీ మద్యాన్ని ఏఎన్ఆర్ బార్‌తో పాటు జనార్దన్‌రావుకు వాటాలున్న కంచికచర్ల, భవానీపురంలోని శ్రీనివాస వైన్స్‌లో విక్రయాలు చేస్తుంటారు. వీటితో పాటు కొండపల్లి, ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, కోస్తా జిల్లాలోని పలు వైన్ షాపులు, బెల్ట్ షాపులకు ఇక్కడి నుంచే నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన అట్టపెట్టెలపై చింతలపూడి మండలం, పేదవేగి మండలం అని రాసి ఉండటం గమనార్హం.టీడీపీ ప్రజాప్రతినిధి అండతో..జనార్దనరావుకు స్థానిక టీడీపీ కీలక నేతలతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆయన బావమరిదితో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి అండదండలు లేకుండా జనావాసాల మధ్య పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. జనార్దనరావు సోదరుడు అద్దెపల్లి జగన్మోహనరావు, మరో నిందితుడు కట్టా రాజును రెండు రోజులుగా విచారించడంతో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దనరావుకు చెందిన ఏఎన్నార్ బార్‌ను ఆదివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.కూటమి అధికారంలోకి రావడంతో.. ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తంబళ్లపాలెం టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డితో స్నేహం ఏర్పడింది. నిషేధించిన ప్రాంతంలో సుమారు పదేళ్ల క్రితం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నకిలీ సర్టిఫికెట్తో ఏఎన్నార్ బార్ ఏర్పాటు చేశాడు. 2024 ఎన్నికల ముందు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అ«ధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె, ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. అమాయకులు బలి..రూ.99కే నాణ్యమైన మద్యం వైన్ షాపుల ద్వారా విక్రయిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు సమీపంలోని ఓ వైన్స్‌లో ఇటీవల దాములూరుకు చెందిన వ్యక్తి మద్యం తాగిన కొద్దిసేపటికి అక్కడే మృతి చెందాడు. జూపూడి వైన్స్‌లో కిలేశపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మద్యం తాగి ఇంటికి వెళుతూ దారిలో మృత్యువాత పడ్డాడు. ఈ రెండు ఘటనల్లో అక్రమ మద్యం వ్యాపారులు మృతుల కుటుంబాలతో రాజీ కుదుర్చుకున్నారు. ఇక వెలుగు చూడని కల్తీ మద్యం చావులు మరెన్నో ఉన్నాయి.నకిలీ మద్యంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇంతకాలం తాము తీసుకున్నది నకిలీ మద్యం అని తెలియడంతో మద్యం ప్రియులకు నోట మాట రావడం లేదు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఐఆర్లో తెనాలి ఐతానగర్‌కు చెందిన కొడాలి శ్రీనివాసరావును ఏ–12గా చేర్చారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న భవనం లీజు అగ్రిమెంటు శ్రీనివాసరావు పేరుతో ఉండడంతో ఆయన్ను నిందితుడిగా చేర్చినట్లు పేర్కొన్నారు.కాగా తెనాలిలోని శ్రీనివాసరావు ఇంట్లో ఎక్సైజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఎలాంటి సామగ్రి లభ్యం కాలేదని తెలుస్తోంది. కాగా నకిలీ మద్యంతో తంబళ్లపల్లె టీడీపీ నాయకులకు సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లె జనార్దనరావు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఆరోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని తెలిపాడు.భారీగా నకిలీ మద్యం సీజ్.. ములకలచెరువు నుంచి అందిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నంలోని గోడౌన్‌పై దాడులు చేశాం. దాడుల్లో నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్ , పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, ఎటువంటి లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్‌ను సీజ్ చేశాం. గోడౌన్లో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో (ఒక్కో క్యాన్ 35 లీటర్లు) 3,325 లీటర్ల స్పిరిట్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ 384 బాటిళ్లు, మంజీర బ్లూ 24 బాటిళ్లు మొత్తం 1,272 బాటిల్స్ సీజ్ చేశాం.లేబుల్స్ లేని మద్యం 136 కేసులు, 6578 బాటిల్స్ , ఓఏబీ లేబుల్స్ 6500, ఖాళీ బాటిల్స్ 22,000, ఖాళీ క్యాన్లు 6, పైపులు 2, మిషన్–1 సీజ్ చేశాం. ఏ–1 ముద్దాయి అద్దెపల్లి జనార్దనరావు సోదరుడు జగన్మోహన్రావును అదుపులోకి తీసుకుని విచారించాం. జనార్దన్ సన్నిహితుడు కట్టా రాజును అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం గోడౌన్‌ను తనిఖీ చేశాం. జనార్దనరావు స్వదేశానికి రాగానే అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతాం. – టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్, విజయవాడ -
కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులు: జూపూడి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్ లింకులు కూటమి ప్రభుత్వంలోని పెద్దల వరకు ఉన్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను సాగించేందుకు తెలుగుదేశం నేతలు ప్లాన్ చేసుకున్నారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని అన్నారు.కల్తీ మద్యాన్ని కూటమి నేతల చేతుల్లో ఉండే ప్రైవేటు మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున చెలామణి చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం విక్రయాల్లో ప్రతి మూడు బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యంగా తేలిందంటే, ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలనే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయులతో కల్తీ మద్యం తమారు చేయిస్తున్నారనే ఆరోపణలకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు సమీపంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమే వెలుగుచూసింది. ఈ నకిలీ మద్యం మాఫియాను నడిపించేది సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులేనని బయటపడింది.ఆఫ్రికా నుంచి ఆంధ్రాకు మద్యం మాఫియావిదేశాల నుంచి సంస్థలను ఆహ్వానిస్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు చెబుతుంటారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందే ఏపీలో కల్తీ మద్యం రాకెట్‌ను ఆఫ్రికా నుంచి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆఫ్రికాలో మద్యం తయారీ, చెలామణిలో సంపాధించిన అనుభవాన్ని ఏపీలో వినియోగించి, కోట్లు సంపాదించేందుకు వ్యూహం పన్నారు. టీడీపీ పెద్దల ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు జనార్ధన్ నాయుడు ఇందుకు అంతా రంగం సిద్ధం చేశాడు. ఈ దందాకు అనుగుణంగానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీ నిబంధలను మార్పు చేసింది.గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం విక్రయాలను ప్రైవేటు వారికి ఇచ్చేందుకు నిర్ణయించారు. లిక్కర్ షాప్‌లు అన్నీ లాటరీ అంటూ హంగామా చేసి, మొత్తం దుకాణాలను అధికార తెలుగుదేశం వారి చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే మద్యం సిండికేట్లను ఏర్పాటు చేశారు. అనధికారికంగా పర్మిట్ రూంలను నిర్వహించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాప్‌లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత తమ కల్తీ లిక్కర్ దందాను ప్రారంభించారు. ఎక్కడికక్కడ కల్తీ మద్యం డెన్లను, జిల్లాల్లో మద్యం గోడౌన్లను ఏర్పాటు చేసుకుని నిత్యం వేల సంఖ్యలో కల్తీ లిక్కర్ బాటిళ్ళను చెలామణి చేయడం ప్రారంభించారు. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యాపారం ద్వారా దండుకుంటున్న సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున మరణాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విష ప్రచారం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయిస్తూ, జవాబుదారీతనంతో విక్రయాలు చేసినా కూడా ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. వారు చెప్పిన మరణాలు నిజమా అని చూస్తే, ఎక్కడా ఇది వాస్తవం అనేందుకు ఆధారాలు లేవు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను తక్కువ రేటుకే క్వాలిటీ మద్యం అందిస్తాను అంటూ హామీలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేస్తున్న కల్తీ మద్యంపై ఆయన ఏం సమాధానం చెబుతారు?ఇతర రాష్ట్రాల నుంచి స్పిరిట్ తీసుకువచ్చి, రంగు కలిపి, నకిలీ మద్యం లేబుళ్ళతో ఏకంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌లకు పంపిణీ చేస్తున్నారు. రకరకాల కల్తీ మద్యం బ్రాండ్లను తయారు చేసి, అందమైన పేర్లతో చెలామణి చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా ఈ కల్తీ మద్యం బ్రాండ్లే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నాం. 'సుమో, షాట్, బెంగుళూరు బ్రాందీ, ఛాంపియన్, కేరళా మాల్ట్...' ఇలా అనేక రకాల పేర్లతో మార్కెట్లో ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.ఈ కల్తీ మద్యం రాకెట్ ఎంత వేగంగా విస్తరించిందీ అంటే అన్నమయ్య జిల్లాలో తయారవుతున్న ఈ మద్యంను కోస్తా ప్రాంతంలో కూడా అమ్మేందుకు ఏకంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోడవున్లో నిల్వ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులే ఈ రాకెట్‌ను పట్టుకున్నారు. పట్టుబడని కల్తీ మద్యం గోడవున్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. ప్రమాదకరమైన ఈ కల్తీ మద్యాన్ని తాగేవారు అతి త్వరగా అనారోగ్యంతో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ప్రజలు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం తన ధనదాహంకు ప్రజల ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. -
నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మద్యం తయారు చేసి.. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ లింక్‌లు పెరిగిపోయాయి.. ఇప్పుడు అవే బట్టబయలయ్యాయి.‘‘ఎన్నికలకు ముందు 99 రూపాయలు మద్యం అమ్ముతామంటే ఎదో అనుకున్నాం.. ఇలా నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తారు అనుకోలేదు. ఇబ్రహిపట్నంలో ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది. టీడీపీకి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో వైన్ షాపు ఉంది. ఇక్కడ నుండే అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు వెనుక ఎవరు ఉన్నారో వారి పై చర్యలు తీసుకోవాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
AP: ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్‌గా గుర్తించారు. జనార్ధన్ సోదరుడు జగన్మోహన్రావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్రావు, కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్ధనరావు గోడౌన్లో తనిఖీలు చేపట్టారు. గోడౌన్లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు, 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేశారు. హోలోగ్రామ్ స్టిక్కర్లు , వందల కొద్దీ ఖాళీ బాటిళ్లు, కేరళ మార్ట్, ఓఎస్డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్, కారిమిల్ను మిక్స్ చేసి నకిలీ మద్యాన్ని నిందితులు సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత, ఏ1 జనార్థన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనార్ధన్ ఆఫ్రికా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. జనార్ధన్ విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని ఎక్సైజ్ సీఐ తెలిపారు.మరోవైపు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం తయారీ డంప్వద్ద బయటపడ్డ డైరీ ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపట్టారు. పీటీఎం మండలం సోంపల్లి గ్రామంలో బెల్ట్‌షాపుపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్క జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లాలో బయట పడిన నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర లేపారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, పార్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా.. అది బెడిసి కొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థాయిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొత్త కుతంత్రం రచించారు.‘కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ ‘కీలక’ నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్ బయట పడటంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు.. స్థానిక నాయకులే కారణమంటూ డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యాన్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్‌తో రోజుకు 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.పైగా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకలచెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబుతాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడైపోయాయని అన్నారుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్ బాటిల్ తయారీకి రూ.8 లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్‌ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వాళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి. -
‘నకిలీ’ దందా డైరీలో నిక్షిప్తం
సాక్షి, రాయచోటి/ ములకలచెరువు/పెద్దతిప్పసముద్రం/ఇబ్రహీంపట్నం (మైలవరం): అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ వ్యవహారంలో మరి కొన్ని కీలక వివరాలు లభ్యమయ్యాయి. అక్కడ దొరికిన డైరీ (చిన్న పుస్తకం)లో నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సరఫరా అయిన వివరాలు రాసి ఉండటం చర్చనీయాంశమైంది. అయితే ఆయా బెల్ట్ షాపులపై సజ్ అధికారులు తొందరపాటుతో చర్యలకు ఉపక్రమించొద్దని పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో తూతూ మంత్రంగా ఒకటి రెండు షాపులపై దాడులు చేసి మమ అనిపించేలా ‘షో’ చేస్తున్నారు. కాగా, పాల వ్యాన్ తరహాలో ఉన్న ఆటోలో నకిలీ మద్యం సరఫరా అయ్యేది.ఈ విషయమై రెండు రోజులుగా ప్రజల్లో భారీగా చర్చ జరగడంతో రాజేష్‌కు చెందిన ఈ వ్యాన్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పెద్దతిప్పసముద్రం మండల టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు ఇంటిలో, ఆయన నిర్వహిస్తున్న ఆంధ్రా వైన్స్‌లో నకిలీ మద్యం గుర్తించగా ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేయడం తెలిసిందే.టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ పరారీలో ఉన్నట్టు చెబుతూ ఆయన దుకాణం జోలికి వెళ్లక పోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం సాయంత్రం రాజేష్ నిర్వహిస్తున్న ‘రాక్ స్టార్’ మద్యం దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు మీడియాకు వెల్లడించారు. ఈ షాపులో ఎంత నకిలీ మద్యం నిల్వ ఉందనే వివరాలను మాత్రం వెల్లడించ లేదు. జనార్దనరావు, రాజు ఇళ్లల్లో తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లు, పచారీ దుకాణం, బార్లో శనివారం సోదాలు చేపట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పచారీ దుకాణం, బార్ నిర్వహిస్తున్న జనార్దనరావు, అతని పచారీ దుకాణంలో పనిచేసే కట్టా రాజు ఇళ్లను తనిఖీ చేశారు. వ్యాపార వేత్తగా ఉన్న జనార్దనరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనప్పటికీ పలువురు టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. జనార్దనరావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, కట్టా రాజు పరారీలో ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, జనార్దనరావు బార్లో ఇన్నాళ్లూ మద్యం తాగిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు.దానిమ్మ తోటలో నకిలీ లిక్కర్ బాక్సులు పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల పంచాయతీ పరిధిలోని ఉప్పరవాండ్లపల్లిలో వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన దానిమ్మ తోటలో మూడు బాక్సుల్లో బీర్లు, నకిలీ మద్యం పట్టుబడింది. ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన బీరు బాటిళ్ల హోలోగ్రామ్ లేబుల్ స్కాన్ కాకపోవడంతో బీర్లు కూడా నకిలీవని తేలింది. ఈ మేరకు సీఐ అనుమానం వ్యక్తం చేస్తూ విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.పట్టుబడిన మద్యం బాక్సులను కట్టా సురేంద్ర నాయుడు ఇటీవల బాబు అనే వ్యక్తి ద్వారా ఇక్కడకు పంపినట్లు రైతు వెంకటరెడ్డి పోలీసులకు తెలిపాడు. బాబు అనే వ్యక్తి మండలంలోని టి.సదుం పంచాయతీ పరిధిలోని చెన్నరాయునిపల్లికి చెందినవాడు. కట్టా సురేంద్ర నాయుడుకు నమ్మిన బంటు. కల్తీ మద్యం బాక్స్‌లను బెల్ట్ షాపులకు తరలించేవాడని తెలుస్తోంది. దానిమ్మ తోటలో పట్టుబడిన నకిలీ మద్యం వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ మద్యం తాగి ఒకరి మృతి
గుంతకల్లు టౌన్: అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమాన్ సర్కిల్లో ఓ వైన్ షాపు వద్ద మద్యం తాగుతూ బేల్దారి పెద్దన్న (39) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం యడవలి గ్రామానికి చెందిన పెద్దన్న బేల్దారి పని చేస్తుంటాడు. ఆదివారం ఉదయం ఓ వైన్ షాపులో మద్యం కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న అనధికార పర్మిట్ రూమ్‌లో బండలపై కూర్చొని కొద్ది కొద్దిగా తాగుతుండగా 15 నిమిషాల్లోనే విపరీతంగా మైకం తలకెక్కి కిందకు ఒరిగిపోయాడు. అతని వెంట వచ్చిన మరో వ్యక్తి కూడా విపరీతమైన మైకంలో తూలుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.ఆ తర్వాత కొందరు వెళ్లి చూడగా పెద్దన్న మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి చిన్న పెద్దక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వన్‌టౌన్ సీఐ మనోహర్ చెప్పారు. మద్యం తాగిన వ్యక్తి కుప్పకూలిపోయి చనిపోయాడని తోటి మందుబాబులు, స్థానికులు వైన్ షాపు సిబ్బందికి చెప్పినా వారు పట్టించుకోక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యం తాగడానికి ఏర్పాటు చేసిన బండలను పగులగొట్టారు. కాగా, అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు రట్టయిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన నకిలీ మద్యం తాగినందునే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఏం స్కెచ్ వేశావ్ చంద్రబాబూ?: వైఎస్ జగన్
2024–25 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు. ప్రైవేట్ మద్యం షాపులు, ఊరూరా బెల్ట్ షాపులు, ఇతరత్రా విచ్చలవిడి అమ్మకాల నేపథ్యంలో 2025–26 ఆర్థిక ఏడాది మొదటి ఐదు నెలల్లో ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే. అంటే కేవలం 3.10 శాతం వృద్ధి మాత్రమే. ఏటా సహజంగా వచ్చే 10 శాతం పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా చంద్రబాబూ? –మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లాలో నకిలీ మద్యం మాఫియా వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నకిలీ మద్యం తయారీ కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి, రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా? అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మీరు, ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమోకానీ, లిక్కర్ సిండికేట్లతో, నకిలీ మద్యం తయారీల ద్వారా, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకూ వీరంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోంది.⇒ మీ లిక్కర్ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకూ విస్తరించిన బెల్టుషాపుల మాఫియాలకు, నకిలీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని తీసివేసి, వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్లవే. బెల్టుషాపులు టీడీపీ వాళ్లవే. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లు టీడీపీ వాళ్లవే. అక్రమ మద్యం తయారీ దారులు కూడా టీడీపీ నేతలే. వాళ్లు తయారు చేస్తారు.. ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే, మీ షాపుల ద్వారా, మీ బెల్టుషాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.⇒ లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడ్డమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి, విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారు. మార్ట్లు పెట్టారు. తిరిగి మళ్లీ ఇల్లీగల్ బెల్టుషాపులు తెరిచి ప్రతి వీధిలోనూ పెట్టారు.రాత్రి పగలు అనే తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే, కాగ్ నివేదికల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రూ.6,782.21 కోట్లు కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో, విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం రూ.6,992.77 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, నకిలీ లిక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టేగా అర్థం?⇒ నకిలీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ, గోదావరి జిల్లాల్లోనూ, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. కారణం.. ఈ అక్రమాల వెనుక ఉన్నది మీ బినామీలు అయిన మీ టీడీపీ వాళ్లే. దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఇవాళ ములకలచెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ, బెల్టుషాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి, నకిలీ బాటిళ్లను పట్టుకునే వారు. కానీ అలా జరగలేదు.⇒ పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్‌ఛార్జి కనుసన్నల్లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తే, వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు, టీడీపీ ఇన్‌ఛార్జి అనుచరుడి మద్యం దుకాణం వైపు అధికారులెవ్వరూ కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి, మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే. మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా?