నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా | Chandrababu New Drama on Fake Liquor | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా

Oct 6 2025 3:48 AM | Updated on Oct 6 2025 3:48 AM

Chandrababu New Drama on Fake Liquor

సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లాలో బయట పడిన నకిలీ మద్యం రాకెట్‌లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర లే­పారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, పా­ర్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా.. అది బెడిసి కొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దాసరిపల్లి జయ­చంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు­ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తద్వారా ఈ వ్య­వహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థా­యిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొ­త్త కుతంత్రం రచించారు.

‘కల్తీ మద్యం ఆ­రోప­ణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్‌ చేస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశా­రు.  భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ ‘కీలక’ నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్‌ బయట పడటంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు.. స్థానిక నాయకులే కారణమంటూ డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement